ASBL NSL Infratech

జూన్ 2న ఘనంగా తెలంగాణ దశాబ్ది వేడుకలు.. తెలంగాణ లోగో ఆవిష్కరణ వాయిదా..

జూన్ 2న ఘనంగా తెలంగాణ దశాబ్ది వేడుకలు.. తెలంగాణ లోగో ఆవిష్కరణ వాయిదా..

తెలంగాణ రాష్ట్ర కొత్త చిహ్నం ఆవిష్కరణ పై కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2న లోగోను ఆవిష్కరించాలి అన్న నిర్ణయాన్ని వాయిదా వేసింది. జూన్ 2న తెలంగాణలో జరగబోతున్న దశాబ్ది వేడుకలలో భాగంగా రాష్ట్ర గీతం మాత్రమే ఆవిష్కరించాలని నిర్ణయించుకుంది. కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కొత్త లోగో పై కసరత్తు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ లోగో డిజైన్ చేసే బాధ్యతలు కళాకారుడు రుద్ర రాజేశంకు అప్పగించడం జరిగింది. లోగో కోసం ఇప్పటికే పలు నమూనాలను అతను సీఎం రేవంత్ రెడ్డికి చూపించారు. అయితే తెలంగాణ లోగో ప్రజాస్వాముకంగా ఉండడంతో పాటు ఉద్యమ తెలంగాణను ప్రతిబింబించేలా ఉండాలి అని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.

తెలంగాణ గత ప్రభుత్వమైన బీఆర్ఎస్ చార్మినార్, కాకతీయ కళాతోరణంలతో తెలంగాణ లోగోని ఒక రాజముద్ర లాగా ఏర్పాటు చేసింది. అయితే చార్మినార్, కాకతీయ కళాతోరణం రాచరిక పోకడలు అనే సాకుతో వీటిని లోగో నుంచి తొలగించడానికి మొదటి క్యాబినెట్ సమావేశంలో రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనిపై తీవ్రంగా స్పందించిన బీఆర్ఎస్ నేతలు తెలంగాణ చారిత్రాత్మక కట్టడాలైన చార్మినార్, కాకతీయ కళాతోరణం ను లోగో నుంచి తొలగించడం పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాలు తీసుకోవడం మానుకోకపోతే ప్రజా నిరసన ఎదుర్కో క హెచ్చరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతలతో కలిసి చార్మినార్ని సందర్శించిన ఆయన రేవంత్ సర్కార్ ప్రవర్తిస్తున్న తీరుపై తీవ్ర నిరసన కూడా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఆయన తప్పుపట్టారు. 

గత పది సంవత్సరాలలో తెలంగాణకు ఎంతో మంచి జరిగిందని.. అప్పుడు జరిగిన అభివృద్ధి ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల నాశనం అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అభివృద్ధిని పట్టించుకోకుండా కేవలం రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసే సాధించుకున్న తెలంగాణ లో జరుగుతున్న దశాబ్ది ఉత్సవాల కోసం పండుగ వాతావరణన్ని నిర్మించాల్సింది పోనిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం..ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలతో అభాస పాలవుతోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తెలంగాణ తల్లితో పాటు లోగో ఆవిష్కరణ పై సంప్రదింపులు జరిపిన తరువాతే మార్పులు చేయాలి అని రేవంత్ సర్కార్ భావిస్తుందని టాక్.



 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :