ASBL NSL Infratech

అమెరికా వేదికగా ప్రతిష్ఠాత్మక సదస్సు... తెలంగాణవాసికి ఆహ్వానం

అమెరికా వేదికగా ప్రతిష్ఠాత్మక సదస్సు... తెలంగాణవాసికి ఆహ్వానం

అమెరికా వేదికగా జరగనున్న ప్రతిష్ఠాత్మక ఆక్టన్‌ యూనివర్సిటీ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రంజిత్‌  కుమార్‌ పూర్తి స్కాలర్‌షిప్‌ను పొందారు. ఆర్థిక,  వ్యక్తిగత స్వేచ్ఛలతో నైతిక మతపరమైన విలువలను పునరుద్ధరించే లక్ష్యంతో యూఎస్‌ గ్రాండ్‌ ర్యాపిడ్స్‌లో ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు ఆక్టన్‌ యూనివర్సిటీ కాన్ఫరెన్స్‌ నిర్వహించనుంది. నాలుగు రోజులపాటు వేదాంత శాస్త్రం, తత్వ శాస్త్రం,  వ్యవస్థాపకత, అంతర్జాతీయ అభివృద్ధి, మార్కెట్‌ ఆధారిత ఆర్థిక శాస్త్రం మధ్య సంబంధాన్ని పరిశోధించే ప్రత్యేక సెషన్స్‌ నిర్వహించనున్నారు. స్వేచ్ఛా సమాజం మూలాలను అన్వేషించడానికి గాను నిర్వహించే అంతర్జాతీయ సదస్సులో పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉందని స్వతంత్ర సెంటర్‌ ఆఫ్‌ హ్యూమన్‌ ఫ్లరిషింగ్‌ సహా వ్యవస్థాపకులైన రంజిత్‌ కుమార్‌ అన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :