ASBL Koncept Ambience
facebook whatsapp X

కాంగ్రెస్ ఆపరేషన్ కౌన్సిల్ షురూ..?

కాంగ్రెస్ ఆపరేషన్ కౌన్సిల్ షురూ..?

తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎప్పుడు ఏనేత పార్టీ మారతాడో తెలియదు. నిన్నటివరకూ పార్టీలో ఉన్న నేత.. ఉన్నట్టుండి సీఎం రేవంత్ తో కనిపిస్తున్నాడు. పార్టీ కండువా మార్చేస్తున్నారు. దీంతో ఎవరిని నమ్మాలో, ఎలా ముందుకెళ్లాలో గులాబీ పార్టీకి అర్థం కావడం లేదు.

ఆరు నెలల క్రితం కొలువుదీరిన కాంగ్రెస్‌ సర్కార్‌.. బొటాబోటి మెజారిటీతోనే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తర్వాత ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరడంతో ప్రభుత్వం మరింత బలపడింది. ప్రస్తుతం కాంగ్రెస్‌ సర్కార్‌కు ఉన్న ముప్పు ఏమీలేదు. అయితే అసెంబ్లీలో బలం ఉన్న కాంగ్రెస్‌కు మండలిలో మాత్రం బలం లేదు. కేవలం నలుగురు మాత్రమే ఎమ్మెల్సీలు ఉన్నారు. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులు మండలిలో ఆమోదం పొందడం కష్టమే. ఈ నేపథ్యంలో ఈ చికాకులు తొలగించడంపై రేవంత్‌ సర్కార్‌ దృష్టిపెట్టింది.

బీఆర్‌ఎస్‌ శాసన మండలి విలీనం..?

ప్రస్తుతం తెలంగాణలో ఆపరేషన్‌ కౌన్సిల్‌ కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.. ఆయన కొడుకు లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అయిన సుఖేందర్‌రెడ్డి కూడా త్వరలో పార్టీ మారడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో మెజారిటీ ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌లోకి తీసుకెళ్లి బీఆర్‌ఎస్‌ మండలి పక్షాన్ని విలీనం చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.

గతంలో ఇలాగే..

1983లో టీడీపీ పార్టీని స్థాపించిన ఎన్టీఆర్‌ 8 నెలల్లోనే రాష్ట్రంలో బంపర్‌ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. అసెంబ్లీలో ఆ పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఉన్నా.. కౌన్సిల్‌లో మాత్రం టీడీపీకి బలం లేదు. దీంతో అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను నాడు కౌన్సిల్‌ తిరస్కరించేంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఎన్టీఆర్‌ ఏకంగా మండలినే రద్దు చేశారు. ఇక 2019లో కూడా విభజిత ఏపీలో ఇదే పరిస్థితి. ఈ ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు సాధించగా, టీడీపీ 23కు పరిమితమైంది. కానీ, ఏపీ మండలిలో టీడీపీని మంచి బలం ఉంది. వైసీపీకి బలం లేదు. ఈ కారణంగానే అసెంబ్లీ ఆమోదించిన మూడు రాజధానుల బిల్లును మండలి తిరస్కరించింది. దీంతో జగన్‌ కూడా మండలి రద్దుకు కేంద్రానికి లేఖ రాశారు. అయితే ఏడాది తర్వాత దానిని ఉపసంహరించుకున్నారు. తాజాగా 2023లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఏపీ మండలిలో టీడీపీకి బలం లేదు. దీంతో టీడీపీ కూడా ఆపరేషన్‌ మండలి చేపట్టే అవకాశం ఉంది. లేదంటే.. కేంద్రంలో తన మద్దతో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వానికి మండలి రద్దు చేయాలని కోరే అవకాశం ఉంది.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :