ASBL NSL Infratech

కేసీఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ త్వరగా కోలుకుని అసెంబ్లీ అడుగుపెట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆకాంక్షించారు. యశోద ఆసుపత్రిలో తుంటి ఎముక మార్పిడి అనంతరం చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను సీఎం రేవంత్‌ పరామర్శించారు. ఆరోగ్యం ఎలా ఉందని ఆరా తీశారు. మంత్రి సీతక్క, షబ్బీర్‌ అలీతో కలిసి ఆసుపత్రికి వెళ్లిన ముఖ్యమంత్రికి ఆసుపత్రి ఎండీ జి.సురేందర్‌ రావు, సీనియర్‌ జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ ఎంవీ రావు, డాక్టర్‌ జి.దేవందర్‌రావు తదితరులు స్వాగతం పలికారు. కేసీఆర్‌ చికిత్స పొందుతున్న ప్రత్యేక గది వద్దకు తోడ్కోని వెళ్లారు. అక్కడ మాజీ మంత్రులు  కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ను సీఎం కలుసుకున్నారు. కేటీఆర్‌ భుజం తట్టి  రేవంత్‌ ధైర్యం చెప్పారు. అనంతరం కేసీఆర్‌ చికిత్స పొందుతున్న గదిలోకి వెళ్లి ఆయనతో మాట్లాడారు. ఆసుపత్రి బయట రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ వైద్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని  సీఎస్‌ను ఆదేశించాం. ఆయన త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని ఆకాంక్షిస్తున్నాం. సమస్యలపై ప్రజల పక్షాన అసెంబ్లీలో కేసీఆర్‌ మాట్లాడాల్సిన అవసరముంది. మంచి పాలన అందించడానికి ఆయన సలహాలు అవసరం అని అన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :