ASBL NSL Infratech

కౌంటింగ్ కు వేళాయె....

కౌంటింగ్ కు వేళాయె....

తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మరికొన్ని గంటల్లో మొదలుకానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. 119 నియోజకవర్గాల వారిగా కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ నిర్వహించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో 29 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసుల ఆంక్షలు, 144 సెక్షన్ అమలు చేశారు. కౌంటింగ్ సందర్భంగా రోడ్లపై ర్యాలీలు, టపాసులు కాల్చడం, ఊరేగింపులపై నిషేధం విధించారు.

ఒక్క హైదరాబాద్‌లోనే 15 కౌంటింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున ... మొత్తం 17వందల 66 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌పై మైక్రో అబ్జర్వర్, ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంల లెక్కింపు మొదలవుతుంది. . 8.30 గంటల నుంచి ఈవీఎంల లెక్కింపు మొదలవుతుంది. ఐతే...పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఉంటే... పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం లెక్కింపు సమాంతరంగా కొనసాగుతుంది.

తెలంగాణ అసెంబ్లీలో 119 స్థానాలు ఉండగా... 2 వేల 290 మంది బరిలో ఉన్నారు. వీరిలో 221 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. లెక్కింపు కేంద్రాల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.స్థానిక పోలీసులు, ఆర్మ్ డ్ రిజర్వ్, కేంద్ర బలగాలు స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పహారా కాస్తున్నారు. 40 కంపెనీల బలగాలతో భద్రత కల్పిస్తున్నారు. ఎన్నికల కమిషన్ అనుమతి ఉన్నవారికే స్ట్రాంగ్ రూమ్స్‌లోకి అనుమతిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర ఒక డీసీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్ఐలతో పాటు ఇతర సిబ్బందితో విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర 144 సెక్షన్‌తో పాటు మూడంచెల భద్రతా వ్యవస్థను అమలు చేస్తున్నారు. మొదటి అంచెలో పారామిలటరీ బలగాలు, రెండో స్థాయిలో సాయుధ సిబ్బంది, మూడో స్థాయిలో సివిల్ పోలీసులు భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. అగ్నిప్రమాదానికి అవకాశం లేకుండా అగ్నిమాపక పరికరాలను సైతం అధికారులు అందుబాటులో ఉంచారు.

స్ట్రాంగ్ రూంల దగ్గర సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాలు సహా దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఓటరు తీర్పు, అభ్యర్థుల భవితవ్యం ఆదివారం తేలిపోనుంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓటరన్న తీర్పు వెల్లడికానుంది. ఉదయం పది గంటలకల్లా తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశం వుంది. మధ్యాహ్నం 12కి పూర్తిస్థాయిలో ఏ పార్టీకి మెజారిటీ వస్తుందో తేలే ఛాన్సుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :