ASBL NSL Infratech

నాటా అందాల పోటీలు..

నాటా అందాల పోటీలు..

ఉత్తర అమెరికా తెలుగు సమితి ఆధ్వర్యంలో జూన్‌ 30 నుంచి జూలై 2వ తేదీ వరకు నిర్వహించనున్న నాటా కన్వెన్షన్‌ సంబరాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఈ కన్వెన్షన్‌లో పాల్గొనేందుకు ఎంతోమంది ప్రముఖులను ఆహ్వానించినట్లు కన్వెన్షన్‌ నాయకులు తెలిపారు. ఈ కన్వెన్షన్‌లో భాగంగా వివిధ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు.

టీవీ5 వారితో కలిసి నాటా అందాల పోటీలను నిర్వహిస్తున్నట్లు ఈ పోటీలకు చైర్‌గా ఉన్న ఉషా చింత తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనాలనుకునేవారు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి చివరి తేదీ మే 7, 2023గా తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేవారు తమ సైన్‌ అప్‌ చేసి, ఆడిషన్‌ టేపులను పంపించాలని కోరారు. విజేతలు వారి విజేత కిరీటంతో పాటు మోడలింగ్‌ అవకాశాలు, షార్ట్‌ ఫిల్మ్‌ అవకాశాలు మరియు ప్రత్యేక బహుమతులు పొందుతారని ఆమె తెలిపారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా లయ గోర్టీ మరియు పూజా ఝవేరి, టాలీవుడ్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ నటీమణులు ఉన్నారని చెప్పారు. 

ప్రాంతీయ పోటీలు వివరాలు 

ఫిలడెల్ఫియా (జూన్‌ 3)
న్యూజెర్సీ (జూన్‌ 4)
వాషింగ్టన్‌/వర్జీనియా (జూన్‌ 10)
రాలీ (జూన్‌ 11)
అట్లాంటా (జూన్‌ 17)
డల్లాస్‌ (జూన్‌ 18)
ఆస్టిన్‌ (జూన్‌ 24)
హ్యూస్టన్‌ (జూన్‌ 25)

జూలై 02, 2023న టెక్సాస్‌లోని డల్లాస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే నాటా మెగా కన్వెన్షన్‌ సందర్భంగా సెమీ-ఫైనల్స్‌ మరియు ఫైనల్స్‌ పోటీలను ఏర్పాటు చేశారు. 
ఈ పోటీల్లో పాల్గొనాలనుకువారు ఈ లింక్‌ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.

www.nataconventions.org/committee_details.php?cid=68

missnata@nataconventions.org

www.nataconventions.org

 

Click here for Event Flyers

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :