ASBL NSL Infratech

ఏపీలో టీడీపీ రాజకీయప్రతీకారేచ్ఛ..?

ఏపీలో టీడీపీ రాజకీయప్రతీకారేచ్ఛ..?

ఐదేళ్లుగా వైసీపీ ఏకఛత్రాధిపత్యంగా పాలన సాగించింది. అడిగితే దాడులు, విధ్వంసం.. సరైన ప్రతిపక్షం లేకపోవడంతో ఆడింది ఆట పాడింది పాటగా సాగింది.అడిగిన వారిపై అభ్యంతరకరమైన భాషతో వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. ఇక గ్రామాల్లో అయితే చాలా చోట్ల వేరే పార్టీ జెండా క నిపిస్తే సహించని పరిస్థితి సైతం నెలకొంది. దాడులు, విధ్వంసక కార్యక్రమాలకు పాల్పడ్డారు.

అధికారం అండతో ఓరకంగా పోలీసు రాజ్యం నడిచిందని చెప్పవచ్చు. ప్రధాన పార్టీల అగ్రనేతలు చంద్రబాబు, పవన్ పర్యటనలకు సైతం అడ్డంకులు కల్పించిన పరిస్థితులున్నాయి. దీంతో తమపై దాడులు చేసి, సైకోయిజాన్ని అమలు చేస్తున్న వారినెవరినీ వదిలిపెట్టబోమని చంద్రబాబు, పవన్ స్పష్టం చేశారు. లోకేష్ ఇంకో అడుగు ముందుకేసి మాదగ్గర రెడ్ బుక్ ఉందని.. అందులో తప్పుచేసిన వారి పేర్లు రాసుకుంటున్నామని.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని చట్టపరంగా శిక్షిస్తామన్నారు.

ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో అన్నట్లుగానే ఐదేళ్లు ఉగ్గబట్టుకుని ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు .. పలుచోట్ల దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం పవర్ లోకి రావడం, గతానికి భిన్నంగా కూటమి అగ్రనేతలు సైతం ఉండడం.. వైసీపీ కేడర్ ను ఆత్మరక్షణలోకి నెట్టేసింది. అది ఎంతగా అంటే టీడీపీ దాడులు పెరిగిపోతున్నాయని... ఈరోజు మీది, రేపు మాది అంటూ వైసీపీ తరపున జగన్ వీడియో పోస్టు చేసే స్థాయికి చేరింది. అంతే కాదు.. తమ కేడర్ పై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయని.. జోక్యం చేసుకుని వాటిని ఆపేలా చేయాలని గవర్నర్ కు ఇప్పటికే జగన్ విజ్ఞప్తి చేశారు కూడా..

రాష్ట్రంలో ఈ పరిస్థితికి కారణమెవరు? గతంలో తమ పార్టీవారు దాడులు చేస్తుంటే, మౌనం దాల్చిన జగన్ తప్పు చేసినట్లు కాదా... ఇప్పుడు టీడీపీ వారు చేస్తే మాత్రం తప్పవుతుందా..? అన్న చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి.. దాడులు చేసింది ఎవరైనా, అది తప్పే.. ఎందుకంటే దేశంలో రాజ్యాంగం ఉంది. ఓపార్టీని ప్రజలు గెలిపించారంటే.. ఆపార్టీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని అర్థం. అంతే కానీ.. తాము అధికారంలోకి వస్తే దాడులు చేయమని కాదు. తమ పార్టీనేతలు, కార్యకర్తలను అదుపు చేయాలన్నది ప్రజాభిప్రాయం. మీరు, మీరు కొట్టుకోవడం కాదు...మాకు ప్రజారంజకమైన పాలన కావాలని ఏపీ ప్రజలు భావిస్తున్నారు.

మరోవైపు పరిస్థితి చేయి దాటుతుందని గ్రహించిన వైసీపీ అధినేత జగన్ గవర్నర్ కు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేతలు నేరుగా గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలు, దాడులు పెరుగుతున్నాయని.. తక్షణం కలుగ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు వైసీపీలో దూకుడు నేతలంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇంకోవైపు వైసిపి హయాంలో నిర్మాణాలను, శిలాఫలకాలను, పేర్లను టిడిపి శ్రేణులు ధ్వంసం చేస్తున్నాయి. దీనిపై కూడా వైసిపి శ్రేణులు ఆందోళనతో ఉన్నాయి. ఇంకా ప్రమాణస్వీకారం చేయకుండానే ఈ రకమైన విధ్వంసానికి దిగుతుండడంపై భయంతో గడుపుతున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు పై దాడులు పెరిగిన నేపథ్యంలో.. ఆ పార్టీ ఒక వీడియోను రూపొందించింది.’ఈరోజు నీది.. రేపు మాది.. మరిచిపోకు ఈ నిజం’ అంటూ సాగిన ఈ వీడియోను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ పోస్టు వైరల్ అవుతోంది. గత ఐదేళ్లలో మీరు చేసిన విధ్వంసాల మాటేంటి? చేసిన అరాచకాలు మరిచిపోయారా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు అసంతృప్త నేతలు, మొన్నటి ఎన్నికల్లో సైలెంట్ అయిన వైసీపీ నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. చాలామంది వైసిపి నేతలు పార్టీని వీడియో అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు దాడులు, మరోవైపు నేతల నిష్క్రమణతో వైసీపీలో ఒక రకమైన ఆందోళన నెలకొంది. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపడానికి ఈ వీడియో విడుదల చేసినట్లు తెలుస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :