ASBL Koncept Ambience
facebook whatsapp X

టీడీపీ స్థానిక వ్యూహం...

టీడీపీ స్థానిక వ్యూహం...

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించిన టీడీపీ.. ఇప్పుడు స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు దక్కించుకోవడంపై ఫోకస్ పెట్టింది. అధికారం మారిన ద‌రిమిలా.. క్షేత్ర‌స్థాయిలో మునిసిప‌ల్ కార్పొరేష‌న్ల‌ను కూడా ద‌క్కించుకునేందుకు టీడీపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. మెజారిటీ కార్పొరేట‌ర్ల‌ను పార్టీలో చేర్చుకుని పాల‌నా ప‌గ్గాలు అందిపుచ్చుకునేలా పార్టీ వ్యూహాలు ర‌చించింది. ఇప్ప‌టికే చిత్తూరులో ఈ వ్యూహం స‌క్సెస్ అయింది. కేవ‌లం ముగ్గురు మాత్ర‌మే టీడీపీ కార్పొరేట‌ర్లు ఉన్న చిత్తూరు కార్పొరేష‌న్‌లో ఇప్పుడు 18 మంది వైసీపీ కార్పొరేట‌ర్ల‌ను చేర్చుకున్నారు.త‌ద్వారా చిత్తూరు కార్పొరేష‌న్‌లో కూట‌మి పాల‌న వ‌చ్చేసింది. ముఖ్యంగా మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ వంటివారిని కూడా త‌న‌వైపు తిప్పుకోవ‌డంలో టీడీపీ స‌క్సెస్ అయింది.

ఇప్పుడు రాష్ట్రానికి గుండెకాయ లాంటి విజయవాడ కార్పొరేషన్ పైనా టీడీపీ నేతలు ఫోకస్ పెట్టారు. ఇక్కడ వైసీపీకి బ‌ల‌మైన నాయ‌కులు ఉన్నారు. వారిని నయానో, భయానో పార్టీలోకి చేరేలా చేసుకోవడం ద్వారా.. విజయవాడ కార్పొరేషన్ పైనా పసుపుజెండా ఎగిరేలా చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇది కూడా రెండు మూడు రోజుల్లోనే పూర్తి కానుంద‌ని సమాచారం.. ఈ బాధ్య‌త‌ల‌ను ఓ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడికి పార్టీ అప్ప‌గించినట్టు పార్టీ వర్గాల్లో ఇన్ సైడ్ టాాక్.

ఇదే విధంగా గుంటూరు, విశాఖ కార్పొరేషన్లను తమపరం చేసుకునేందుకు కూటమి నేతలు ప్లాన్స్ రచిస్తున్నట్లు సమాచారం. విశాఖలో మాజీ మంత్రిగంటా శ్రీనివాసరావు.. వైసీపీ కార్పొరేట‌ర్ల‌ను మ‌చ్చిక చేసుకునే ప‌నిలో ఉన్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూట‌మి న‌గ‌ర పాల‌నను త‌న చేతిలోకి తీసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌డం గ‌మ‌నార్హం. రెండేళ్ల క్రితం.. 2021లో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అన్ని కార్పొరేష‌న్ల‌ను వైసీపీ ద‌క్కించుకుంది. విజ‌య‌వాడ‌, విశాఖ‌, చిత్తూరు, తిరుప‌తి.. విజ‌య‌న‌గ‌రం ఇలా.. అన్ని కార్పొరేష‌న్ల‌ను కూడా.. వైసీపీ సొంతం చేసుకుని పాల‌న చేస్తోంది. అయితే అధికార పార్టీ నుంచి ఒత్తిడి, నిధులు రావాలంటే విపక్షంలో ఉంటే ఉపయోగం లేదని భావిస్తున్న విపక్ష కార్పొరేటర్లు సైతం కండువాలు మార్చుకునేందుకు ముందుకొస్తున్నారు.

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :