ASBL NSL Infratech

తెలంగాణలో టీడీపీ తిరిగి తెరమీదకు వస్తుందా..?

తెలంగాణలో టీడీపీ తిరిగి తెరమీదకు వస్తుందా..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగయిపోయింది. అయితే తిరిగి తెలంగాణ రాజకీయాలలో మరొకసారి తెలుగుదేశం పురుడు పోసుకోబోతోందా.. అంటే పరిస్థితులు అవుననే సమాధానం ఇస్తున్నాయి. తాజాగా విదేశీ పర్యటన పూర్తిచేసుకుని వచ్చిన చంద్రబాబు.. తెలంగాణలో ఇంకా అక్కడో, ఇక్కడో మిగిలిన టీడీపీ నేతలను సమావేశమయ్యారు. దీంతో మరొకసారి తెలంగాణపై చంద్రబాబు తన ప్రభావాన్ని చూపడానికి సిద్ధపడుతున్నారు అని అందరూ భావిస్తున్నారు. శుక్రవారం నాడు తెలంగాణలోని టీడీపీ నేతలతో సమావేశమైన చంద్రబాబు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నియామకంపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. స్థానిక సంస్థలతో పోటీకి సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన నేతలకు సూచించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరుపడిన తర్వాత అక్కడ తెలుగుదేశం ప్రభ చాలా వేగంగా తగ్గుతూ వచ్చింది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ కేవలం 15 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది.

అయితే ఆ తర్వాత పరిస్థితులు కూడా టీడీపీ కు వ్యతిరేకంగా చోటుచేసుకున్నాయి.. ఓటుకు నోటు కేసులో ఇటు రేవంత్ రెడ్డి దొరకడం.. చంద్రబాబు ప్రభుత్వాన్ని హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చడం అన్ని వెంట వెంటనే జరిగిపోయాయి. తర్వాత క్రమంగా తెలంగాణలో మిగిలిన టీడీపీ పార్టీ నేతలు.. ఎమ్మెల్యేలు.. మెల్లిగా టీఆర్ఎస్‌లోకి చేరడం.. మరి కొంతమంది కాంగ్రెస్ వైపు వెళ్లడం జరిగింది. క్రమంగా పరిస్థితులు ఎక్కడికి చేరుకున్నాయి అంటే.. 2019లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే తెలంగాణలో విజయం సాధించగలిగారు. 

అయితే ఆ తర్వాత వారిద్దరు కూడా గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో.. తెలంగాణలో టీడీపీ భవిష్యత్తు దాదాపు శూన్యంగా మారింది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు దొరక్క పోవడంతో.. ఎన్నికలకు దూరంగా ఉన్న చంద్రబాబు.. తన సామాజిక వర్గం బలంగా ఉన్న ఖమ్మంలో కాంగ్రెస్ కు మద్దతు తెలిపారు.ఎవరు ఊహించని విధంగా కారు స్పీడ్ కు బ్రేకు వేసి రేవంత్ తన సర్కార్ను ఏర్పాటు చేశాడు.

శిష్యుడు తెలంగాణ సీఎం కావడంతో తిరిగి చంద్రబాబు అక్కడ తన వ్యూహాలను మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. అయితే ఈ సరికొత్త పరిణామాలపై తెలంగాణ వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని టాక్. ఇదే విషయంపై రీసెంట్ గా పాశం యాదగిరి లాంటి సీనియర్ జర్నలిస్టులు తమ అభిప్రాయాలను బహిరంగంగానే వ్యక్తీకరించారు. చంద్రబాబు శిష్యుడిగా పేరు తెచ్చుకున్న రేవంత్ తో.. చంద్రబాబు కలిస్తే తెలంగాణలో కార్పొరేట్ రాజకీయాలు తిరిగి షురూ అవుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఈ నేపథ్యంలో కేటీఆర్, కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :