టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) స్వస్తిశ్రీ క్రోది నామ సంవత్సర ఉగాది వేడుకలు ఏప్రిల్ 27వ తేదీన వైభవంగా నిర్వహిస్తున్నారు. ఫ్రిస్కోలోని ఫ్రిస్కో హైస్కూల్‌లో ఈ వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో హైలైట్‌గా గాయకుడు కారుణ్య, గాయని మాళవిక తో సంగీత విభావరిని ఏర్పాటు చేశారు. ఎంలైవ్ బ్యాండ్ వారి సంగీత కచేరి కూడా అందరినీ ఆకట్టుకుంటుందని టాంటెక్స్ ప్రెసిడెంట్ సతీష్ బండారు తెలిపారు. ఈ వేడుకలకు పలు సంస్థలు స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి అందరూ హాజరై విజయవంతం చేయాలని టాంటెక్స్ కార్యనిర్వాహకవర్గం కోరుతోంది.
Tags :