MKOne TeluguTimes-Youtube-Channel

డల్లాస్‌ లో తానా పాఠశాల సర్టిఫికెట్లు, పుస్తకాలు పంపిణీ

డల్లాస్‌ లో తానా పాఠశాల సర్టిఫికెట్లు, పుస్తకాలు పంపిణీ

తానా ఆధ్వర్యంలో అమెరికాలోని తెలుగు చిన్నారులకు తెలుగు భాషను నేర్పిస్తున్న పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తక పంపిణీ కార్యక్రమం డల్లాస్‌ రీజియన్‌లో సెప్టెంబర్‌ 11వ తేదీ ఉదయం జరిగింది. గత ఏడాది పాఠశాలలో చదివిన చిన్నారులకు సర్టిఫికెట్లతో పాటు ఈ సంవత్సరం వివిధ కోర్సుల్లో నమోదయిన చిన్నారులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఇర్వింగ్‌, థామస్‌ జఫర్సన్‌ పార్క్‌, నందు పాఠశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జూమ్‌ ద్వారా తానా అద్యక్షుడు అంజయ్య చౌదరి, తానా రీజనల్‌ కోఆర్డినేటర్‌ సతీష్‌ కొమ్మన ప్రారంభించారు. వెంకట్‌ కొర్రపాటి తల్లితండ్రుల సందేహాలకు సమాధానాలిచ్చారు.

పాఠశాల చైర్మన్‌ నాగరాజు నలజుల గారు ఇర్వింగ్‌ గాంధీ పార్క్‌ నందు ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న 250 మంది చిన్నారులకు పుస్తకాలు అందజేశారు. గతేడాది తరగతులు పూర్తిచేసుకున్న పిల్లలకు ధృవీకరణ పత్రాలు అందించారు. అలాగే నాగరాజు నలజుల గారు ఈ విద్యాసంవత్సరానికి గాను పిల్లలకు కోర్సులు, ప్రణాళికల వివరాలతో పాటు ఉపాధ్యాయుల పరిచయం, తరగతుల వివరాలు తల్లితండ్రులతో చర్చించారు. ఈకార్యక్రమంలో డా. అరుణ జ్యోతి, లిఖిత,లోకేష్‌ నాయుడు, గణేష్‌ నలజుల, గాయత్రి నలజుల పాల్గొన్నారు.

 

Click here for Event Gallery

 

Tags :