ASBL NSL Infratech

తానా పాఠశాల అడ్మిషన్స్ ప్రారంభం

తానా పాఠశాల  అడ్మిషన్స్ ప్రారంభం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తానా పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి తెలుగు తరగతుల (Telugu Classes) అడ్మిషన్స్ మొదలయ్యాయి. మీ అందరి సహాయ సహకారాలతో దిగ్విజయంగా గడిచిన 2023-24 విద్యా సంవత్సరానికి వీడ్కోలు పలుకుతున్నాము.

తానా పాఠశాల ద్వారా తెలుగు నేర్చుకుంటూ, తెలుగు వెలుగులు విరజిమ్ముతున్న విద్యార్థులందరికీ మా అభినందనలు, ఆశీస్సులు. మన భాషను భావితరాలకు అందజేయాలన్న తపనతో తమ చిన్నారులను పాఠశాలలో చేర్పించిన తల్లిదండ్రులందరికీ మా కృతజ్ఞతాభివందనాలు. ఈ వేసవి విరామం అనంతరం క్లాసెస్ మొదలవుతాయి.

paatasala.tana.org ద్వారా వచ్చే సంవత్సరానికి మీ పిల్లల పేర్లు నమోదు చేసుకోండి. వేసవి సెలవుల్లో పిల్లలు ఇంట్లో తెలుగు మాట్లాడేలా ప్రోత్సహించండి. వేసవి విరామం తర్వాత, 2024-25 తెలుగు తరగతులకు తిరిగి స్వాగతం పలుకుదాం. సంవత్సరం మొత్తానికి రజిస్ట్రేషన్ రుసుము $125. ఇతర వివరాలకు Paatasala@tana.org కి ఈమెయిల్ చేయండి లేదా ఫ్లయర్ లో ఉన్న ఫోన్ నంబర్స్ ని సంప్రదించండి.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :