ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

డాలస్‌లో తానా ఆధ్వర్యంలో స్కూలు బ్యాగుల పంపిణీ

డాలస్‌లో తానా ఆధ్వర్యంలో స్కూలు బ్యాగుల పంపిణీ

తానా బ్యాక్‌ప్యాక్‌ వితరణ కార్యక్రమాన్ని  డాలస్‌లో తానా డాలస్‌  ప్రాంతీయ ప్రతినిధి సతీష్‌ కొమ్మన ఆధ్వర్యాన, ప్రస్తుత తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి సారథ్యంలో నిర్వహించారు. స్థానిక యూలెస్‌ లోని హెచ్‌ఇబి  పాఠశాలలో 200 మందికి పైగా పేద విద్యార్థులకు స్కూల్‌ బ్యాగ్‌లను  అందజేశారు. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు అట్లాంటా నుంచి డాలస్‌ కు వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా వుందని, సతీష్‌ కొమ్మన తెలియజేశారు. తానా డాలస్‌ ప్రాంతీయ ప్రతినిధి సతీష్‌ కొమ్మన, మరిన్ని సమాజ సేవా కార్యక్రమాలతో అన్ని సంస్థలతో కలసి పనిచేసేందుకు తానా ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, రాబోయే కాలంలో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మరియు తానా బృందం సహకారంతో మీ ముందుకు వస్తామని, అందరు తానా నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు.

స్కూల్‌ సూపరింటిండెంట్‌ డా. జో హ్యారింగ్టన్‌ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా తానా వారు స్కూలు వారికి అందిస్తున్న సహాయాన్ని అభినందించి కృతజ్ఞతలు తెలియజేశారు.

తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి మాట్లాడుతూ తానా పూర్వాధ్యక్షులు డా. నవనీతకృష్ణ  ప్రారంభించిన బ్యాక్‌ పాక్‌ కార్యక్రమం అమెరికా దేశం అంతటా మంచి ప్రజాదరణ పొందింది అన్నారు.   మేము ఈ దేశంలో చాలా కాలం నుంచి నివశించడానికి అవకాశం కల్పించిందని, అటువంటి సదవకాశం కల్పించిన ఈ దేశ సమాజానికి తిరిగి ఏదైనా ఇవ్వాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టిందని, అలాగే తానా ఫౌండేషన్‌, తానా టీం స్క్వేర్‌ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు అమెరికా, ఇండియా లో చేపడుతోందని తెలియజేసారు. తానా వారికి ఈ అవకాశం ఇచ్చిన స్కూల్‌ వారికి ధన్యవాదాలు తెలియజేశారు.

తానా డాలాస్‌ టీం సతీష్‌ కొమ్మన, లోకేష్‌ నాయుడు కొణిదల, డా. ప్రసాద్‌ తోటకూర, శ్రీకాంత్‌ పోలవరపు, అశోక్‌ కొల్లా, మురళి వెన్నం  మరియు స్థానిక తానా సభ్యులు చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు.

తానా కోశాధికారి అశోక్‌ కొల్లా మాట్లాడుతూ, బ్యాక్‌ ప్యాక్‌ కార్యక్రమం డాలస్‌తో పాటు , అమెరికా అంతట పలునగరాలలో కూడ బ్యాక్‌ ప్యాక్‌ కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు ఆనందంగా వుందని, ఇటువంటి మరిన్ని కార్యక్రమాలను తానా ద్వారా నిర్వహిస్తామని చెప్పారు.

డా. ప్రసాద్‌ తోటకూర మాట్లాడుతూ, డా. నవనీతకృష్ణ ప్రారంభించిన ఈ కార్యక్రమం నిరాటంగా కొనసాగడం చాలా సంతోషంగా వుంది అన్నారు.  

తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా కార్యవర్గ బృందం శ్రీకాంత్‌ పోలవరపు, లోకేష్‌ నాయుడు, చినసత్యం వీర్నపు, నాగరాజు నలజుల, డా. ప్రసాద్‌ తోటకూర, చంద్ర పోలీస్‌, ప్రమోద్‌ నూతేటి, లెనిన్‌ వీరా, వెంకట్‌ బొమ్మ, దిలీప్‌, సుధీర్‌ చింతమనేని, పరమేష్‌ దేవినేని తదితరులు విరాళాలు అందించి, కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు.

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :