మిడ్ వెస్ట్ చికాగోలో TANA కల్చరల్ కాంపిటీషన్స్..
తెలుగువారి వారసత్వ సంస్కృతిని సంరక్షించడం ధ్యేయంగా అనునిత్యం పాటుపడుతున్న TANA సంస్థ మరొకసారి తన కల్చరల్ కాంపిటీషన్స్ ను నిర్వహించబోతోంది. ఆగస్టు 3న నేపర్‌విల్లే లోని 1120 E డెల్హీ రోడ్, NIU ఆడిటోరియం నందు కల్చరల్ కాంపిటీషన్స్ నిర్వహిస్తారు. Dr. ఉమా. R. కాటికి (అరమండ్ల) ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయి.
ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ పోటీలను అస్సలు మిస్ చేసుకోకుండా తప్పకుండా హాజరుకండి. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకొని మీలోని ప్రతిభను చాటి చెప్పి టైటిల్స్ ను గెలుచుకోండి.
ఈ పోటీలు మూడు కేటగిరీస్ లో నిర్వహించబడతాయి. క్లాసికల్, సినిమా, ఫోక్ విభాగాలలో పాటల పోటీతోపాటు డాన్స్ కాంపిటీషన్ కూడా నిర్వహిస్తాము. మీరు అద్భుతమైన డాన్స్ చేయగలిగే జోడి అయితే మీకు కూడా ఈ కాంపిటీషన్స్ లో బంపర్ ఆఫర్ ఉంటుంది. అయితే ఈ పోటీలలో పాల్గొనడానికి ఏజ్ రెస్ట్రిక్షన్స్ కూడా కంపల్సరిగా ఫాలో అవ్వాల్సిందే..
సోలో సింగింగ్, గ్రూప్ డ్యాన్స్ విభాగంలో జూనియర్స్ కేటగిరీలో 9 సంవత్సరాలకంటే తక్కువ వయసు పిల్లలు పాల్గొనవచ్చు.
జూనియర్స్ క్యాటగిరీలు 9 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు పిల్లలు పాల్గొనవచ్చు.
సీనియర్ విభాగంలో పాల్గొనే వారి వయసు 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఉండాలి.
డాన్స్ జోడిలో పాల్గొనే జంట వయసు 25 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి.
పోటీలలో పాల్గొనదలుచుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ తప్పకుండా చేయించుకోవాలి. కింద ఇచ్చినటువంటి లింకులను ఉపయోగించుకొని తప్పనిసరిగా మీరు రిజిస్ట్రేషన్‌ను 27 జూలైలోగా పూర్తి చేసుకోండి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ క్లోజ్ అవుతాయి కాబట్టి వీలైనంత త్వరగా మీ పేర్లు రిజిస్టర్ చేసుకోండి.
https://tinyurl.com/TANA-Participants
https://tinyurl.com/TANA-Attendees