ASBL NSL Infratech

తెరకెక్కనున్న అలనాటి అందాల తార బయోపిక్...

తెరకెక్కనున్న అలనాటి అందాల తార బయోపిక్...

హీరోయిన్ జమున అంటే అందానికి, అభినయానికి మారు పేరు. తన గడుసుతనంతో ఆ రోజుల్లోనే కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసింది ఈ అందాల నటి. టాలీవుడ్ లో దశాబ్ద కాలం పాటు తన నటనతో ఇటు తెలుగు, అటు హిందీ, తమిళ ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన నటి జమున. హైదరాబాద్ లోని తన నివాసంలో 86 ఏళ్ళ జీవిత ప్రస్థానాన్ని తెల్లవారుఝామున నిద్రలోనే ముగించారన్న విషయం తెలిసిందే. ప్రస్తుత హీరోయిన్స్ సైతం ఆమె మృతి పట్ల సంతాపం తెలియజేయసారు.

ఇదిలా ఉంటే తమిళ ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడ్తుంది. స్టార్ హీరోయిన్ జమున బయోపిక్ తమిళంలో తెరకెక్కబోతుంది అని గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎప్పటినుండో ఈ ప్రాజెక్ట్ చేయాలని మేకర్స్ రెడీ గా ఉన్నారట. ఈ బయోపిక్ కోసం ఆల్రెడీ స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకున్నారట. ఇక జమున పాత్రకి ఎవరు న్యాయం చేయగలరు అని ఆలోచిస్తుండగా, తెరపైకి మిల్కీ బ్యూటీ తమన్నా పేరు వచ్చింది అని సమాచారం.

జమున లోని ఆ గడుసుతనం, తన జీవితంలో ఇద్దరు అగ్ర హీరోలతో జరిగిన గొడవలు, వీటన్నిటిని అధిగమించి ఆత్మాభిమానం గల మహిళగా ఆమె ఇండస్ట్రీలో ఎలా నిలదొక్కుకున్నారు అనే అంశాలపై ఈ చిత్ర మేకర్స్ దృష్టి పెడుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుంది అనేది ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం తమన్నా జైలర్ సినిమాలో రజినీకాంత్ కి జోడీగా నటిస్తుంది. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమా చేస్తుంది. ఈ రెండు సినిమాల తర్వాత జమున బయోపిక్ లో మిల్కీ బ్యూటీ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :