ASBL NSL Infratech

ప్లేటు ఫిరాయించేసిన స్వరూపానంద..! ఆటాడుకుంటున్న నెటిజన్స్!!

ప్లేటు ఫిరాయించేసిన స్వరూపానంద..! ఆటాడుకుంటున్న నెటిజన్స్!!

రాజకీయ నాయకులు ప్లేటు ఫిరాయించడం మామూలే. ఒకరోజు ఒక పార్టీలో ఉంటారు.. మరో రోజు మరో పార్టీలోకి వెళ్లిపోతుంటారు. వాళ్ల విలువలు, నైతికత గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. అయితే ఇప్పుడు ఆ కోవలోకి స్వామీజీలు కూడా చేరుతుండడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీతో అంటకాగే స్వామీజీలు ఆ పార్టీ ఓడిపోగానే దాన్ని వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారంలోకి వస్తున్న పార్టీకి దగ్గరయ్యేందుకు ట్రై చేస్తున్నారు. ఇప్పుడు విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీజి తీరు కూడా ఇలాగే ఉంది.

విశాఖ శారదాపీఠం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీ రాజశ్యామల యాగాలతో సుప్రసిద్ధులు. రాజకీయ నాయకులు కూడా ఆ స్వామీజీతో మంచిగా మెదులుతుంటారు. ఎన్నికలకు వెళ్లేముందు... గెలిచిన తర్వాత వెళ్లి స్వామీజీ దర్శనం చేసుకుంటూ ఉంటారు. స్వామీజీ కూడా రాజకీయ నాయకులతో స్వామీజీలాగా కాకుండా ఆత్మబంధువు లాగా ప్రవర్తిస్తుంటారు. హత్తుకుని ఆశీర్వదిస్తుంటారు. సహజంగా నేతలతో, ఇతరుతో ఇంత సన్నిహితంగా స్వామీజీలు ఉండరు. కానీ స్వరూపానందేంద్ర స్వామీజీ రూటు మాత్రం సెపరేటు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో స్వరూపానందేంద్ర స్వామీజీ సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఆశీస్సులకోసం వాళ్లిద్దరూ పరితపిస్తుంటారు. ఆయన కూడా వాళ్లను ఓన్ చేసుకుని ఆశీర్వదిస్తుంటారు. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఆయన ప్రవర్తనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. అయినా ఏమాత్రం పట్టించుకోలేదు. జగన్ ను ఆకాశానికెత్తుతూ పొంగిపోయేవారు. ఆయనే పదికాలాలపాటు అధికారంలో ఉండాలని ఆశించేవారు.

అయితే ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది. అందుకే స్వామీజీ కూడా మాట మార్చేశారు. ఏకంగా ఆయన విశాఖలో ప్రెస్ మీట్ పెట్టారు. చంద్రబాబుతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పుకొచ్చారు. జగన్ పాలనలో దేవాదాయ వ్యవస్థ సరిగా లేదన్నారు. తాను చెప్పినా వినకపోవడం వల్లే ఓడిపోయారన్నారు. చంద్రబాబు పరిపాలనా దక్షుఢని.. ఆయని ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించారు. తాను ఎవరికో భయపడి ఈ ప్రెస్ మీట్ పెట్టలేదని ముక్తాయించారు. ఇదేంటీ.. చంద్రబాబు ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే స్వామీజీ ప్లేట్ ఫిరాయించేసారని నెటిజన్లు సెటైర్లు వేసుకుంటున్నారు. 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :