ASBL NSL Infratech

అంతు చిక్కని సర్వేలు.. జోరుగా బెట్టింగులు..!!

అంతు చిక్కని సర్వేలు.. జోరుగా బెట్టింగులు..!!

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య పండగ అని భారత ఎన్నికల ప్రక్రియను చెప్పుకుంటూ ఉంటారు. దాదాపు వంద కోట్ల మంది ఈ ఎన్నికల్లో పాలుపంచుకుంటూ ఉండడమే ఇందుకు కారణం. ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు ఎవరికి మద్దతిచ్చారనేది తెలుసుకునేందుకు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ కూడా అదే రోజు రానున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడిపోయే అవకాశం ఉంది.. లాంటి అంశాలపై జోరుగా బెట్టింగులు మాత్రం సాగుతున్నాయి.

దేశంలో మళ్లీ మోదీ ప్రభుత్వమే వస్తుందని చాలాకాలంగా సర్వేలు అంచనా వేస్తూ వస్తున్నాయి. అయితే తొలి రెండు విడతల పోలింగ్ తర్వాత ఎన్డీయే కూటమి కాస్త వెనుకబడిందనే సంకేతాలు వెలువడ్డాయి. ఇండియా కూటమికి కూడా భారీగా సీట్లు రాబోతున్నాయని.. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం దక్కకపోవచ్చని అంచనా వేస్తున్నారు. మోదీకి సునాయస విజయం ఖాయమని అందరూ భావిస్తున్న సమయంలో ఇండియా కూటమి బలపడడం అనే వార్త చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. బీజేపీకి సొంతంగా 370 సీట్లు, ఎన్డీయే కూటమికి 400లకు పైగా సీట్లు వస్తాయనే అంచనాలు మాత్రం ఈసారి నిజం కాకపోవచ్చని పండితులు చెప్తున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే 2019లో సాధించిన 151 స్థానాలకంటే ఎక్కువ సీట్లు సాధించాలనే పట్టుతో పనిచేసింది వైసీపీ. అయితే ఆ పార్టీకి అంత సీన్ లేదని.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఈసారి అధికారంలోకి రాబోతోందని మెజార్టీ సర్వేలు అంచనా కట్టాయి. అయితే కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత సర్వేలకు ఫుల్ స్టాప్ పడడంతో ఏ పార్టీ వైపు ఆంధ్ర ప్రదేస్ ప్రజలు మొగ్గు చూపారనేది అంతు చిక్కలేదు. పోలింగ్ రోజు పరిణామాల అనంతరం వైసీపీ డిఫెన్స్ లో పడినట్లు అర్థమవుతోంది. రీపోలింగ్ జరపాలని వైసీపీ కోరడం దీనికి నిదర్శనం. అయితే జగన్ ఐప్యాక్ ఆఫీసుకు వెళ్లి గతంలో కంటే భారీ మెజార్టీ సాధించబోతున్నామని చెప్పడంతో వైసీపీ శ్రేణుల్లో మళ్లీ ఉత్సాహం తొణికిసలాడింది. దాన్ని కంటిన్యూ చేస్తూ జూన్ 9న విశాఖలో ప్రమాణ స్వీకారం ఉంటుందని వైసీపీ నేతలు చెప్తున్నారు. అయితే కూటమి నేతలు మాత్రం పోలింగ్ రోజు తర్వాత అస్సలు నోరు మెదపలేదు. తాము అధికారంలోకి రాబోతున్నామని, ఫలానాచోట ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రధాన నేతలెవరూ చెప్పలేదు. అయితే అనధికార సర్వేలన్నీ కూటమివైపే ఉండడంతో ఆయా పార్టీల నేతలు మాత్రం ఫుల్ జోష్ లో ఉన్నారు.

సెఫాలజిస్టులు నోరు మెదపకపోవడం బెట్టింగ్ రాయుళ్లకు పెద్ద సమస్యగా మారింది. సర్వేలు బయటకు వచ్చింటే అందుకు అనుగుణంగా బెట్టింగులు వేయడానికి సిద్ధమయ్యారు. అయినా అనధికారికంగా సెఫాలజిస్టుల నుంచి డేటా తెప్పించుకుని అందుకు అనుగుణంగా బెట్టింగులు కాస్తున్నారు. కూటమే గెలుస్తుందని ఎక్కువ మంది బెట్టింగులు వేసినట్లు సమాచారం. అదే సమయంలో కొన్నిస్థానాల్లో మెజార్టీలపైన కూడా జోరుగానే బెట్టింగులు నడుస్తున్నాయి. మరి చూడాలి ఏం జరుగుతుందో.. ఎవరు గెలుస్తారో..!?

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :