ASBL Koncept Ambience
facebook whatsapp X

సూర్య‌44 గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్

సూర్య‌44 గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్

చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్ర‌తీ హీరో త‌మ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. తెలుగులో కొన‌సాగుతున్న ఈ హంగామా ఇప్పుడు కోలీవుడ్ కు కూడా పాకింది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇప్ప‌టికే కంగువ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయ‌డానికి రంగం సిద్ధం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

కంగువ త‌ర్వాత సూర్య త‌న నెక్ట్స్ సినిమాను కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నాడు. సూర్య44 వ‌ర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సూర్య క్యారెక్ట‌రైజేష‌న్, గెట‌ప్ కొత్త‌గా ఉంటాయ‌ని సమాచారం. అంతేకాదు  ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుందంటున్నారు.

సూర్య‌44ని రెండు భాగాలుగా తీస్తున్నార‌ని, ప్ర‌స్తుతానికి ఈ విష‌యాన్ని మేక‌ర్స్ సీక్రెట్ గా ఉంచుతున్నార‌ని తెలుస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ తోనే మంచి బ‌జ్ ఏర్ప‌ర‌చుకుంది. ఈ సినిమా సూర్య ఫ్యాన్స్ కు సూప‌ర్ ట్రీట్ ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని యూనిట్ స‌భ్యులు చెప్తున్నారు. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ కు రిలీజ్ చేసేలా మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :