ASBL Koncept Ambience
facebook whatsapp X

ఆ మంచి ఛాన్స్‌ను దేవ‌ర ఎలా వ‌దులుకుంటాడు?

ఆ మంచి ఛాన్స్‌ను దేవ‌ర ఎలా వ‌దులుకుంటాడు?

ఎన్టీఆర్, కొర‌టాల శివ కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా దేవ‌ర‌. పాన్ ఇండియా స్థాయిలో భారీ బ‌డ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా అక్టోబ‌ర్ 10న రిలీజ్ కానున్న‌ట్లు మేక‌ర్స్ ఇప్ప‌టికే అనౌన్స్ చేశారు. కానీ అదే రోజు ర‌జినీకాంత్ వెట్ట‌యాన్ కూడా రిలీజ్ కానుంద‌ని రీసెంట్ గా ఆ చిత్ర నిర్మాత‌లు తెలిపారు. ఈ సినిమా వ‌ల్ల దేవ‌ర‌కు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి న‌ష్టం ఉండ‌దు కానీ త‌మిళనాడు, కర్ణాట‌క లో ఓపెనింగ్స్ మీద ఈ ఎఫెక్ట్ ప‌డే ఛాన్సుంది.

వీటన్నింటికంటే ముఖ్య‌మైన‌ది సెప్టెంబ‌ర్ 27న వ‌స్తామ‌ని చెప్పిన ఓజీ ఇప్పుడు ఆ డేట్ నుంచి త‌ప్పుకుంది. అలాంటి సెల‌వుల సీజ‌న్ ను మిస్ చేసుకోవ‌డం ఇష్టం లేక నిర్మాత నాగ‌వంశీ ముందు జాగ్ర‌త్త‌గా ల‌క్కీ భాస్క‌ర్ ను ఆ డేట్ కు లాక్ చేసుకున్నాడు. దేవ‌ర డిస్ట్రిబ్యూష‌న్ కూడా నాగ‌వంశీనే కాబ‌ట్టి కొర‌టాల ఓకే అంటే వెంట‌నే ఆ డేట్ ను దేవ‌ర కోసం లాక్ చేయొచ్చు.

ఈ డేట్ దేవ‌ర‌కు మంచి ఆప్ష‌న్ కూడా. రెండు వీకెండ్స్ తో పాటూ గాంధీ జ‌యంతి కూడా రావ‌డంతో ద‌స‌రా వ‌ర‌కు మంచి గ్రౌండ్ దొరుకుతుంది. థ‌ర్డ్ వీక్ లో ర‌జినీ సినిమా వ‌చ్చినా కూడా పెద్ద‌గా ఇబ్బంది ఉండ‌దు. ఇవ‌న్నీ చూసుకునే దేవ‌ర‌ను ప్రీ పోన్ చేయాల‌ని మేక‌ర్స్ ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. టీమ్ అంద‌రూ క‌లిసి డిస్క‌స్ చేసుకున్నాక కొర‌టాల ఓకే అంటే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ తో దేవ‌ర నుంచి పోస్ట‌ర్ వ‌చ్చే ఛాన్సుంది. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ సినిమాపై అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి.  

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :