ASBL NSL Infratech

ధ‌నుష్ ను మెప్పించిన సందీప్ కిష‌న్

ధ‌నుష్ ను మెప్పించిన సందీప్ కిష‌న్

రీసెంట్ గానే ఊరు పేరు భైర‌వ‌కోన సినిమాతో ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించాడు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిష‌న్. సందీప్ పేరుకే తెలుగువాడు. అత‌నికి తెలుగులో కంటే మార్కెట్, అవ‌కాశాలు ఎక్కువ‌గా త‌మిళం నుంచే వ‌స్తున్నాయి. రీసెంట్ గా కెప్టెన్ మిల్ల‌ర్ సినిమాలో ధ‌నుష్ తో క‌లిసి న‌టించి త‌న న‌ట‌న‌కు మంచి మార్కులు వేయించుకున్నాడు ధ‌నుష్.

ఇప్పుడు మళ్లీ ధ‌నుష్ హీరోగా స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న రాయ‌న్ అనే సినిమాలో కూడా కీల‌క పాత్ర కొట్టేశాడు. గ్యాంగ్ స్ట‌ర్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా ముగ్గురు అన్న‌ద‌మ్ములు మాఫియాని ఎలా న‌డిపించార‌నే పాయింట్ మీద కొన‌సాగ‌నుంది. రాయ‌న్ లో వ‌యొలెన్స్ కూడా నెక్ట్స్ లెవెల్ లో ఉంటుంద‌ని స‌మాచారం.

త‌మిళంలో ఇప్ప‌టికే సందీప్ కు మంచి బ్రేక్ వ‌చ్చింది. లోకేష్ క‌న‌గ‌రాజ్ తీసిన సినిమా మా న‌గ‌రం సందీప్ కు మంచి విజ‌యాన్ని అందించింది. ఇవి కాకుండా చాలా త‌మిళ సినిమాల్లో సందీప్ న‌టించాడు. రీసెంట్ గా కెప్టెన్ మిల్ల‌ర్ లో సందీప్ యాక్టింగ్ చూశాక ధ‌నుష్, త‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న రాయ‌న్ సినిమాలో ఛాన్స్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఏఆర్ రెహ‌మాన్ సంగీత సార‌థ్యంలో వ‌స్తున్న రాయ‌న్ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్స్ చేస్తున్నారు.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :