ASBL NSL Infratech

సుందర్ సి, తమన్నా భాటియా 'బాక్' మే3న థియేట్రికల్ రిలీజ్

సుందర్ సి, తమన్నా భాటియా 'బాక్' మే3న థియేట్రికల్ రిలీజ్

అత్యంత విజయవంతమైన హారర్ కామెడీ సిరీస్ ‘అరణ్మనై’ నుంచి నాల్గవ చిత్రం అరణ్మనై 4 తెలుగులో 'బాక్' పేరుతో వస్తోంది. సుందర్ సి దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, రాశి ఖన్నా హీరోయిన్స్.  

ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న విడుదల చేయడానికి తొలుత సన్నాహాలు చేశారు మేకర్స్. అయితే ఎండల తీవ్రత అధికంగా వుండటం వలన విడుదల తేదిని వాయిదా వేస్తూ కొత్త తేదిని తెలియజేశారు. మే 3న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన  'పంచుకో' పాట అద్భుతమైన రెస్పాన్స్ తో చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. త్వరలోనే ట్రైలర్ ని విడుదల చేసి తెలుగు ప్రమోషన్స్ ని దూకుడుగా చేయబోతున్నారు మేకర్స్.    

అవ్నీ సినిమాక్స్  P Ltd పతాకంపై ఖుష్బు సుందర్, ACS అరుణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ LLP తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది.
ఈ చిత్రానికి కృష్ణమూర్తి డీవోపీగా పని చేస్తుండగా, ఎడిటింగ్‌ను ఫెన్నీ ఆలివర్‌ పర్యవేక్షిస్తున్నారు. గురురాజ్ ఆర్ట్ డైరెక్టర్.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :