పోస్టర్ పై థమన్ పేరు లేకపోవడానికి అదే కారణమా?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మహేష్ కెరీర్లో 28వ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. ఏ ముహూర్తాన ఈ సినిమాను అనుకున్నారో కానీ అప్పటి నుంచి సినిమా గురించి ఏవొక వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.
వాటిలో మొదటిది ఈ సినిమా పోస్టర్లలో థమన్ పేరు లేకపోవడం. రీసెంట్‌గా రిలీజ్ చేసిన టైటిల్ తాలూకు ప్రీ లుక్ పోస్టర్లలో ఎక్కడా థమన్ పేరు ప్రస్తావించలేదు. కేవలం డైరెక్టర్ త్రివిక్రమ్, నిర్మాత చినబాబు పేర్లనే హైలైట్ చేశారు. మరి ఇదంతా కావాలని చేశారా లేక ఏంటన్నది మాత్రం తెలీదు. ఏదేమైనా మే 31న రానున్న టైటిల్ గ్లింప్స్ లో మాత్రం థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంటుంది.
ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, థమన్ వర్క్ పై మహేష్ శాటిస్‌పై కాలేదని, సర్కారు వారి పాటకు యావరేజ్ ఆల్బమ్ ఇచ్చినా ఇప్పుడు ఇచ్చిన మరో ఛాన్స్ ని థమన్ సరిగ్గా వినియోగం చేసుకోవడం లేదని మహేష్ ఫీలింగ్. అంతేకాదు థమన్ కు చేతినిండా ప్రాజెక్ట్స్ ఉన్న ఈ టైమ్ లో అతని నుంచి ది బెస్ట్ అవుట్ పుట్ రాబట్టుకోవడం తేలికైన విషయం కాకపోవడంతో త్రివిక్రమ్ థమన్ విషయంలో మళ్లీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
మరి బయట వినిపిస్తున్న మాటల ప్రకారం, సైలెంట్ గా ఈ సినిమా నుంచి థమన్ ను తప్పించి, వేరే మ్యూజిక్ డైరెక్టర్ ని ట్రాక్ ఎక్కిస్తారా లేక ఇవన్నీ కేవలం రూమర్లని కొట్టిపారేస్తారో తెలియాలంటే మే 31న వచ్చే టీజర్ గ్లింప్స్ లో లాస్ట్ లో థమన్ పేరు ఉంటుందో లేదో చూశాకే డిసైడ్ అవాలి. కాగా ఈ సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్ పరిశీలనలో ఉందన్న విషయం తెలిసిందే.