ASBL NSL Infratech

ఆకట్టుకున్న తానా కళాశాల శ్రీ సీతారామ కళ్యాణం నృత్య ప్రదర్శన

ఆకట్టుకున్న తానా కళాశాల శ్రీ సీతారామ కళ్యాణం నృత్య ప్రదర్శన

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) కళాశాల న్యూ ఇంగ్లాండ్‌ ఆధ్వర్యంలో ‘‘శ్రీ సీతారామ కల్యాణ కూచిపూడి నృత్య’’ ప్రదర్శన కార్యక్రమం ఘనంగా ముగిసింది. యూఎస్‌లోని గ్రేటర్‌ బోస్టన్‌లో శ్రీ కూచిపూడి నాట్యాలయ, తానా కళాశాల న్యూ ఇంగ్లాండ్‌ డైరెక్టర్‌ శైలజా చౌదరి ఆధ్వర్యంలో సుమారు 200మంది విద్యార్థులు, విద్యార్థినిలు కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. తానా కళాశాల విద్యార్థులు సుమారు 200 మందితోటి శ్రీ సీతారామ కళ్యాణం కూచిపూడి నృత్య ప్రదర్శన నభూతో నభవిష్యతి అన్నట్లుగా ప్రదర్శించారు.

శ్రీ సీతారామ కళ్యాణం కూచిపూడి నృత్య ప్రదర్సన ప్రేమ, అందం, శౌర్యం మరియు ఆధ్యాత్మిక వైభవాన్ని మిరుమిట్లు గొలిపే వస్త్రాన్ని నేస్తున్నప్పుడు, బ్రహ్మశ్రీ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు మరియు శ్రీ కృష్ణ వెంపటి గారి కవితా గానం, శ్రీ వడలి ఫణి నారాయణ గారి సంగీత కొరియోగ్రఫీ మరియు శ్రీమతి శైలజా చౌదరి తుమ్మల కళాత్మక దర్శకత్వం మరియు కొరియోగ్రఫీ ప్రేక్షకులని మంత్రముగ్ధులని చేసింది. 200మంది కళాకారులు ప్రదర్శన ఇవ్వడంతో చూసేందుకు ప్రేక్షకులకు రెండు కళ్లూ సరిపోలేదు. కల్యాణ మహోత్సవ వైభవాన్ని వివరంగా తెలిపేలా కార్యక్రమం నిర్వహించారు. ఈ అసాధారణ ప్రదర్శనకు ప్రేక్షకులు నాన్‌స్టాప్‌గా చప్పట్లు కొట్టారు. కార్యక్రమానికి సుమారు 400మంది ప్రేక్షకులు హాజరయ్యారు. అనంతరం తానా మాజీ కోశాధికారి అమ్మని దాసరి.. కళాశాలలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ పద్మావతి యూనివర్శిటీ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.

కార్యక్రమంలో తానా న్యూఇంగ్లాండ్‌ ప్రాంతీయ ప్రతినిధి సోంపల్లి కృష్ణప్రసాద్‌ ప్రసంగించారు. కార్యక్రమంలో తెలుగు గ్రేటర్‌ బోస్టన్‌ అధ్యక్షురాలు దీప్తి గోరా, శ్రీనివాస్‌ గొండి, శివ డోకిపర్తి, చంద్రారెడ్డి, సురేశ్‌ దగ్గుబాటి, రామకృష్ణ కొల్లా, కీర్తి తొగరు, సాయి లక్ష్మి, ఉమా కంతేటి, అనంతా జయం, మాధవి పోరెడ్డి, రజని దగ్గుబాటి, కోటేశ్‌ కందుకూరి, సూర్య తేలప్రోలు, రమణ బిల్లకంటి, సురేశ్‌ సూరపరాజు, మురళీ పసుమర్తి పాల్గొన్నారు.

కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ కూచిపూడి నాట్యాలయ, తానా కళాశాల న్యూ ఇంగ్లాండ్‌ డైరెక్టర్‌ శైలజా చౌదరి కృతజ్ఞతలు తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :