గీతా ఆర్ట్స్ లో శ్రీ విష్ణు సినిమా
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టి హీరోగా ఎదిగాడు యువ నటుడు శ్రీ విష్ణు. హీరోగా శ్రీవిష్ణు నుంచి ఎప్పుడూ వైవిధ్యమైన సినిమాలే వచ్చాయి. గతేడాది సామజవరగమనతో మంచి విజయం అందుకున్న శ్రీ విష్ణు ఇప్పుడు ఓం భీం భుష్ అనే సినిమాతో మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టీజర్ చూస్తుంటే శ్రీవిష్ణు అకౌంట్ లో మరో హిట్ ఖాయమనేలా ఉంది.
ఇదిలా ఉంటే శ్రీ విష్ణు తన తర్వాతి రెండు సినిమాలు ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి గీతా ఆర్ట్స్ తో కార్తీక్ రాజు అనే కొత్త డైరెక్టర్ తో రూపొందనుంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఇప్పుడిప్పుడే పెద్ద బ్యానర్లలో సినిమాలు చేస్తున్న శ్రీ విష్ణు ఓం భీం భుష్ సినిమా కోసం యువి క్రియేషన్స్ తో జత కట్టాడు.
ఇప్పుడు వెంటనే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా అనౌన్స్ చేశాడు. ఇది కాకుండా రాజ రాజ చోర డైరెక్టర్ హాసిత్ గోలితో కూడా శ్రీ విష్ణు ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది రాజ రాజ చోరకు సీక్వెల్ కథనా లేదా వేరేనా అన్నది తెలియాల్సి ఉంది. చూస్తుంటే ఈ ఏడాదిలో శ్రీ విష్ణు నుంచి మంచి లైనప్ ను చూడబోతున్నట్లు అనిపిస్తోంది.