ASBL NSL Infratech

సత్తా చాటుతున్న తెలుగు సినిమా

సత్తా చాటుతున్న తెలుగు సినిమా

69వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో 11 అవార్డుల కైవసం

ప్రపంచపటంలో ఈ ఏడాది ఆగష్టు 23న భారత దేశానికి వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు చంద్రయాన్‌ 3 మిషన్‌ విజయవంతం కావడంతో అమెరికా, రష్యా, చైనా వంటి అగ్ర దేశాల సరసన నిలబడిరది మన భారత దేశం. అది అలావుండగా ఇటీవల మన తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకుని, ఒక్క రోజు తేడాలో ఆగష్టు 24న తెలుగు సినిమా ఖ్యాతి జాతీయ స్థాయిలో యావత్‌ భారతావని తెలుగు సినిమా వైపు చూసేలా వెలుగులు విరజిమ్ముతోంది. భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మంగా భావించే  69వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో 11 అవార్డులను కైవసం చేసుకుని టాలీవుడ్‌ తగ్గేదిలే! అంటూ సంబరాలు జరుపుకుంది తెలుగు సినిమా. ఎస్‌ ఏస్‌ రాజమౌళి తెరక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి ఆరు అవార్డులు లభించగా.. అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంభినేషన్‌ లో  మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించిన ‘పుష్ప - ది రైజ్‌’ చిత్రానికి రెండు అవార్డులు దక్కాయి. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్‌ తేజ్‌ తొలి చిత్రం, మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించిన మరో చిత్రానికి ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంగా ‘ఉప్పెన’. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకున్న తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్‌ చరిత్ర సృష్టించాడు. 90 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటికి వరకు ఎందరో మహా నటులువున్నా  ఎవరికి దక్కని ఈ అవకాశం అల్లు అర్జున్‌కు దక్కింది.

1967లో 15వ జాతీయ పురస్కారాలతో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఉత్తమ నటుడు కేటగిరీ ప్రవేశ పెట్టింది. ఆ ఏడాది బెంగాలీ నటుడు ఉత్తమ్‌ కుమార్‌  ‘ఆంటోనీ ఫిరంగీ’, ‘చీరియాఖానా’ చిత్రాల నుండి తొలి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. ఆ తరువాత హిందీ నటులు 27, మలయాళ నటులు 13, తమిళ నటులు 9, బెంగాలీ నటులు 5, మరాఠీ, కన్నడ నటులు మూడేసి చొప్పున, ఆంగ్ల చిత్ర నటులు 2 అవార్డులను సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటుడు అవార్డు ప్రవేశ పెట్టిన 54 ఏళ్ళ  తరువాత తొలిసారిగా తెలుగు నటుడు ఎంపిక అయ్యాడు. ‘కొండపొలం’ సినిమాలోని ‘‘ధం ధం ధం’’ పాటకు ఉత్తమ గీత రచయితగా చంద్ర బోస్‌ లభించింది. తెలుగు సినిమా ప్రొడ్యూసర్‌ అభిషేక్‌ అగర్వాల్‌ అందించిన కాశ్మీర్‌ ఫైల్స్‌ కు రెండు పురస్కారాలు వచ్చాయి. మన తెలుగు వారైన  పురుషోత్తమాచార్యులు కు ఉత్తమ సినీ విమర్శకుడిగా పురస్కారం లభించడం విశేషం. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తరువాత స్థానంలో సంజయ్‌ లీలా భన్సాలీ గంగూబాయి కాఠియావాడికి 5 అవార్డులు, సర్దార్‌ ఉద్దమ్‌ చిత్రానికి 4 అవార్డులు వచ్చాయి. ఉత్తమ చిత్రంగా ‘రాకెట్రీ’ నిలిచింది. శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవిత కథ ఆధారంగా ప్రముఖ నటుడు ఆర్‌.మాధవన్‌ ఈ సినిమాను నిర్మించారు.  ఆయనే టైటిల్‌ రోల్‌ పోషించి దర్శకత్వం వహించారు. ఉత్తమ నటి అవార్డును ఆలియా భట్‌ (గంగూబాయి కాఠియావాడి), కృతి సనన్‌ (మీమీ) పంచుకున్నారు.   ఉత్తమ గుజరాతీ చిత్రంగా ‘ఛల్లో’ ఎంపికైంది.  ఈ ఏడాది ‘జై భీమ్‌’, ‘మిన్నల్‌ మురళి’, ‘తలైవి’, ‘సర్దార్‌ ఉధమ్‌’, ‘83’, ‘పుష్ప: ది రైజ్‌’, ‘షేర్షా’, ‘ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌’, ‘గంగూబాయి కాఠియావాడి’, ‘నాయట్టు’ తదితర చిత్రాలు పోటీలో నిలిచాయి. 31 విభాగాల్లో ఫీచర్‌ ఫిలింస్‌కు, 24 విభాగాల్లో నాన్‌ ఫీచర్‌ ఫిలింస్‌కు, మూడు విభాగాల్లో రచనా విభాగానికి అవార్డులు ప్రకటించారు. మొత్తం 281 ఫీచర్‌ ఫిలింస్‌ ఈ ఏడాది వివిధ విభాగాల్లో పోటీపడ్డాయి.    

54 ఏళ్ళ తరువాత ఉత్తమ నటుడు అవార్డు అందుకోబోతున్న తొలి తెలుగు నటుడు అల్లు అర్జున్‌

90 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటికి వరకు ఎందరో మహా నటులు వున్నా  ఎవరికి దక్కని ఈ అవకాశం అల్లు అర్జున్‌ కు దక్కింది. 1967లో 15వ జాతీయ పురస్కారాలతో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఉత్తమ నటుడు కేటగిరీ ప్రవేశ పెట్టింది. ఆ ఏడాది బెంగాలీ నటుడు ఉత్తమ్‌ కుమార్‌  ‘ఆంటోనీ ఫిరంగీ’, ‘చీరియాఖానా’ చిత్రాల నుండి తొలి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. ఆ తరువాత హిందీ నటులు 27, మలయాళ నటులు 13, తమిళ నటులు 9, బెంగాలీ నటులు 5, మరాఠీ, కన్నడ నటులు మూడేసి చొప్పున, ఆంగ్ల చిత్ర నటులు 2 అవార్డులను సొంతం చేసుకున్నారు. 

ఇప్పటివరకు ప్రకటించిన 54 అవార్డులలో అత్యధికంగా నాలుగు సార్లు అందుకున్న నటుడు బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, మమ్మూటీ, అజయ్‌ దేవగణ్‌ మూడేసి సార్లు, సంజీవ్‌ కుమార్‌, మోహన్‌ లాల్‌, ధనుష్‌, మిథున్‌ చక్రవర్తి, ఓంపురి,నశీరుద్ధీన్‌ షా, రెండేసి సార్లు చొప్పున అందుకున్నారు. మన దక్షణాదినుండి ఏం జి రామచంద్రన్‌, కమలహాసన్‌, విక్రమ్‌, ప్రకాష్‌ రాజ్‌, ధనుష్‌, సూర్య, పి జె ఆంటోనీ, భరత్‌ గోపి, మమ్ముటి, ప్రేమిజీ, మోహన్‌ లాల్‌, సురేష్‌ గోపి, బాలన్‌ కె నాయర్‌, బాలచంద్ర మీనన్‌, మురళి, సూరజ్‌ వెంజరామూడు, ఎం వి వాసుదేవరావు, చారు హాసన్‌, సంచారి విజయ్‌ లు సొంతం చేసుకున్నారు. అయితే నటీమణుల్లో ఈ ఘనత సాధించిన తెలుగువారు వున్నారు. ఊర్వశిగా పేరొందిన నటి శారద 1968, 1672, 1978లలో తెలుగు మలయాళ చిత్రాల ద్వారా జాతీయ ఉత్తమ నటి అవార్డులు అందుకున్నారు.

1987, 1988ల్లో వరుసగా రెండేళ్లు అర్చన తమిళ చిత్రం ‘వీడు’ తెలుగు చిత్రం ‘దాసీ’ చిత్రాల ద్వారా జాతీయ ఉత్తమ నటి అవార్డులు దక్కాయి. విజయశాంతికి 1990లో ‘కర్తవ్యం’ చిత్రంలో ఆమె నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. 2017లో ‘మామ్‌’ హిందీ చిత్రంలో నటించిన శ్రీ దేవికి, 2018లో ‘మహానటి’ లో సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేషులకు జాతీయ ఉత్తమ నటి అవార్డులు అలరించాయి. ఎందరో తెలుగు మహా నటులు వున్నా ఉత్తమ నటుడు అవార్డు ప్రవేశ పెట్టిన 54 ఏళ్ళ తరువాత తొలిసారిగా తెలుగు నటుడు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ దక్కడం అభినందనీయం.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ఆరు..

ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌కు పలు విభాగాల్లో ఆరు అవార్డులు దక్కాయి. ఉత్తమ ప్రజాదరణ పొందిన ఫీచర్‌ ఫిలింగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పురస్కారం సొంతం చేసుకుంది. ఇక మిగిలిన ఆరు అవార్డులు తెరవెనుక హీరోలకు దక్కాయి. ఉత్తమ నేపథ్య సంగీతం అవార్డును ఆస్కార్‌ విన్నర్‌ ఎం.ఎం.కీరవాణి దక్కించుకున్నారు. ఈయన స్వరపరిచిన ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌ అవార్డును అందుకోగా.. జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో మాత్రం పాటలకు అవార్డు దక్కలేదు. అయితే, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’  సినిమాలో మరో పాపులర్‌ సాంగ్‌ ‘కొమరం భీముడో’కు అవార్డు దక్కింది. ఈ పాట పాడిన కాలభైరవ ఉత్తమ నేపథ్య గాయకుడు అవార్డు పొందారు. ఇక ‘నాటు నాటు’ పాటకు గాను ప్రేమ్‌ రక్షిత్‌ను ఉత్తమ కొరియోగ్రఫీ పురస్కారం వరించింది. బెస్ట్‌ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ అవార్డు కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు దక్కింది. శ్రీనివాస మోహన్‌ ఈ అవార్డు అందుకోనున్నారు. అలాగే, యాక్షన్‌ కొరియోగ్రఫీకి గాను యాక్షన్‌ డైరెక్టర్‌ కింగ్‌ సాలమన్‌కు అవార్డు దక్కింది.

ఉత్తమ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ఇప్పటివరకు ఎన్నో సార్లు ఒకసారి నంది అవార్డు (అత్తారింటికి దారేది)  సౌత్‌ ఇండియా  ఫిలింఫేర్‌, సినీ మా అవార్డ్స్‌, గామా టాలీవుడ్‌ అవార్డ్స్‌ ఇలా ఎన్నో ప్రవేట్‌ సంస్థలనుండి అందుకున్నారు. తొలిసారిగా  ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘పుష్ప: ది రైజ్‌’ చిత్రానికి  69వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ సంగీత దర్శకుడుగా దేవిశ్రీ ప్రసాద్‌ దక్కించుకున్నారు. 

చంద్రబోస్‌కు బెస్ట్‌ లిరిక్స్‌ అవార్డ్‌

పంజా వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘కొండపొలం’. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవ డంలో విఫలమైంది. అయితే, 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో మాత్రం ఈ సినిమాకు అవార్డు దక్కింది. దీనికి కారణం ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్‌. ‘ధమ్‌ ధమ్‌ ధమ్‌’ పాటకు ఆయన అందించిన సాహిత్యానికి పురస్కారం దక్కింది. ఇటీవలే ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ అవార్డు అందుకున్న చంద్రబోస్‌.. ఇప్పుడు జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. 

తెలుగు నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌

‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’కు రెండు అవార్డులు

69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో మా ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’కు రెండు అవార్డులు దక్కాయి. ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం, అలాగే ఉత్తమ సహాయనటిగా పల్లవి జోషి అవార్డులు కైవసం చేసుకున్నారు.

మొత్తంగా తెలుగు సినిమాకు పది అవార్డులు దక్కాయి. జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమాకు ఈ స్థాయిలో అవార్డుల పంట పండడం ఇదే తొలిసారి. ప్రతి సంవత్సరం హిందీ, మలయాళ సినిమాలకు అత్యధికంగా అవార్డులు దక్కుతూ ఉంటాయి. కానీ, ఈసారి తెలుగు దుమ్మురేపింది.

- రాంబాబు వర్మ 

 


ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం ‘ఉప్పెన’
చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయమైన చిత్రం ‘ఉప్పెన’. చిట్టిబాబు సానా దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. రూ.100 కోట్లకు పైగా కలెక్షన్‌ వసూలు చేసింది. ఈ సినిమాను ఉత్తమ తెలుగు చిత్రంగా జ్యూరీ ఎంపిక చేసింది. గత ఏడాది 68వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ‘కలర్‌ ఫొటో’కు అవార్డు దక్కిన విషయం తెలిసిందే.
2015లో ‘శ్రీ మంతుడు’ చిత్రంతో టాలీవుడ్‌ లోకి ఎంటర్‌ అయిన మైత్రీ మూవీ మేకర్స్‌, గ్రామాలను దత్తత తీసుకునే అంశంపై సందేశాత్మకంగా నిర్మించిన చిత్రం ‘శ్రీమంతుడు’ అలాంటి ఉత్తమ చిత్రానికి 3 నంది అవార్డులు, 3 ఫిలిం ఫేర్‌ అవార్డులు, 6 ఐఫా అవార్డులు, 7 సైమా అవార్డులు, వచ్చినా ఆ చిత్రానికి జాతీయ అవార్డు రాలేదు. కానీ 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఏకంగా 3 అవార్డులను సొంతం చేసుకుంది ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘పుష్ప: ది రైజ్‌’, ఉప్పెన చిత్రాలు 2021 సంవత్సరానికి గానూ మూడు జాతీయ జాతీయ వార్డులని కైవశం చేసుకున్నాయి. ‘పుష్ప: ది రైజ్‌’లో నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడు అవార్డును ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సొంతం చేసుకున్నారు. జాతీయ అవార్డ్‌ అందుకున్న తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్‌ చరిత్ర సృష్టించారు. అలాగే  ‘పుష్ప’ చిత్రానికి సంగీతం అందించిన రాక్‌ స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ ఉత్తమ సంగీతం దర్శకుడిగా అవార్డ్‌ని సొంతం చేసుకున్నారు. అలాగే జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘ఉప్పెన’ చిత్రం అవార్డ్‌ని కైవశం చేసుకుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :