ASBL NSL Infratech

మెగా ఫ్యాన్స్ కు గేమ్ ఛేంజ‌ర్ మాస్ ట్రీట్

మెగా ఫ్యాన్స్ కు గేమ్ ఛేంజ‌ర్ మాస్ ట్రీట్

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తున్న సినిమా గేమ్ ఛేంజ‌ర్. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ సినిమా బ‌డ్జెట్ విష‌యంలో నిర్మాత దిల్ రాజు ఎక్కడా కాంప్ర‌మైజ్ అవకుండా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో చ‌ర‌ణ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ న‌టిస్తోంది. ఇప్ప‌టికే వీరిద్ద‌రూ క‌లిసి విన‌య విధేయ రామ సినిమా చేశారు.

ఇదిలా ఉంటే గేమ్ ఛేంజ‌ర్ లో ఓ స్పెష‌ల్ ఐటెమ్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్. ఆ సాంగ్ కోసం ఓ క్రేజీ హీరోయిన్ ను తీసుకోవాల‌ని మేక‌ర్స్ డిస్క‌ష‌న్స్ చేస్తున్నార‌ట‌. చ‌ర‌ణ్‌- శంక‌ర్ కాంబోలో వ‌స్తున్న సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఇంట్రెస్ట్ చూపించ‌డం స‌హ‌జం. దానికి తోడు స్పెష‌ల్ సాంగ్ అంటే క్రేజ్ వ‌స్తుంద‌నే ఆలోచ‌న‌తో ఎవ‌రూ నో చెప్ప‌రు.

ఈ సాంగ్ లో ఏ హీరోయిన్ న‌టించినా స‌రే ఫ్యాన్స్ కు మాత్రం మాస్ ట్రీట్ ప‌క్కా అని, త‌మ‌న్ ఈ సాంగ్ ను చాలా స్పెష‌ల్ గా ఎంతో కేర్ తీసుకుని ట్యూన్ చేస్తున్నాడ‌ని తెలుస్తోంది. చ‌ర‌ణ్ డ్యూయ‌ల్ రోల్ లో న‌టించ‌నున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడ‌నేది మేక‌ర్స్ ఇంకా ఫిక్స్ చేయ‌లేదు. ద‌స‌రా రేసులో రిలీజ్ చేయాల‌ని ప్ర‌ణాళిక‌లు రెడీ చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే మేక‌ర్స్ ఈ విష‌యంలో క్లారిటీ ఇవ్వ‌నున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :