ASBL NSL Infratech

సితార చేతికి దేవ‌ర ప‌గ్గాలు?

సితార చేతికి దేవ‌ర ప‌గ్గాలు?

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న సినిమా దేవ‌ర‌. కొర‌టాల శివ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమా థియేట్రిక‌ల్ రైట్స్ కోసం భారీ పోటీ నెల‌కొన్న విష‌యం తెలిసిందే. టాలీవుడ్ కు చెందిన బ‌డా సంస్థ‌లు నెక్ టు నెక్ త‌ల‌ప‌డుతున్న నేప‌థ్యంలో ఈ డీల్ ను సితార ఎంట‌ర్టైన్మెంట్స్ త‌ర‌పున నాగ‌వంశీ ఓకే చేసుకున్నాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

రూ.115 నుంచి రూ.125 కోట్ల మ‌ధ్య‌లో రెండు తెలుగు రాష్ట్రాల రైట్స్ ను లాక్ చేస్తార‌ని, అగ్రిమెంట్ పూర్త‌వ‌గానే అధికారికంగా అనౌన్స్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. రీసెంట్ గా జ‌రుగుతున్న కొన్ని అంశాలు గ‌మ‌నిస్తే పైన చెప్పింది నిజ‌మే అనిపించ‌క మానదు. త‌న అన్న‌య్య క‌ళ్యాణ్ రామ్ సినిమాల‌కు త‌ప్ప బ‌య‌ట ఈవెంట్ల‌కు అంత‌గా ఇంట్రెస్ట్ చూపించ‌ని జూ. ఎన్టీఆర్ రీసెంట్ గా జ‌రిగిన టిల్లు స్వ్కేర్ స‌క్సెస్ మీట్ కు వ‌చ్చాడు.

ఆ ముందు రోజు రాత్రి టిల్లు స్వ్కేర్ స్పెష‌ల్ ప్రీమియ‌ర్ కూడా చూశాడు. దీనికి కార‌ణం అప్ప‌టికే దేవ‌ర డీల్ కు సంబంధించి త‌న ప్ర‌య‌త్నాల‌ను నాగ‌వంశీ బ‌య‌ట‌పెట్ట‌డ‌మేన‌ని టాక్. పైగా త్రివిక్ర‌మ్ అదే ఈవెంట్ లో 2024 దేవ‌ర నామ సంవ‌త్స‌ర‌మ‌ని భారీ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇవ‌న్నీ చూస్తుంటే దేవ‌ర సినిమా హ‌క్కులు సితార చేతికి రావ‌డంలో పెద్ద‌గా ఆశ్చర్య‌మేమీ లేదు. సినిమా రిలీజ్ కు ఇంకా 5 నెల‌లు టైమున్న‌ప్పటికీ బిజినెస్ డీల్స్ త్వ‌ర‌గా పూర్తి చేసే ఉద్దేశంలో నిర్మాత‌లున్నార‌ట‌. అక్టోబ‌ర్ 10న రిలీజ్ కానున్న దేవ‌ర‌లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :