ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు ఇవే...
ఈ ఏడాది ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలుగా సింగపూర్, జ్యూరిచ్ నిలిచాయి. జ్యూరిచ్ ఆరోస్థానంలో నుంచి ఎగబాకి సింగపూర్ సరసన చేరినట్లు పేర్కొంది. గత ఏడాది సింగపూర్‌తోపాటు తొలిస్థానంలో నిలిచిన న్యూయార్క్ ఈసారి మూడోస్థానానికి పరిమితమైంది. నిత్యావసర సరుకులు, గృహోపకరాణాలు, కొన్నిరకాల సేవల ధరలు పెరిగిన నేపథ్యంలో జ్యూరిచ్ ఖరీదైన నగరంగా మారిందని తెలిపింది. ఈఐయూ నివేదిక మేరకు అత్యంత ఖరీదైన తొలి పది నగరాల జాబితాలో ఆసియా నుంచి సింగపూర్, హాంకాంగ్, ఐరోపా నుంచి జ్యూరిచ్, జెనీవా, ప్యారిస్, కోపెన్‌హాగెన్ ..అమెరికా నుంచి న్యూయార్క్, లాస్‌ఏంజెలెస్, శాన్‌ప్రాన్సిస్కో, ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్ ఉన్నాయి.
Tags :