ASBL NSL Infratech

సిద్దు స్థాయి పెరిగిపోయింది

సిద్దు స్థాయి పెరిగిపోయింది

న‌టీన‌టుల జీవితం మారిపోవ‌డానికి ఒక్క సినిమా చాలు. అలా సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ లైఫ్ ను మార్చేసిన సినిమా డీజే టిల్లు. ఆ సినిమాకు ముందు చాలా సినిమాల్లో న‌టించాడు. అత‌ని పేరు కూడా తెలియ‌కుండానే ఆ సినిమాలు రిలీజై వెళ్లిపోయాయి. సిద్దు చేసిన సినిమాల్లో అత‌నికి మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా అంటే కృష్ణ అండ్ హిజ్ లీల‌.

కానీ సిద్దుకి స్టార్ ఇమేజ్ తెచ్చింది మాత్రం డీజే టిల్లునే. ఆ సినిమా సిద్దుకు మార్కెట్ లో ఓ రేంజ్ క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఆ క్రేజ్ ను పాడుచేసుకోకుండా సిద్దు చాలా టైమ్ తీసుకుని మ‌రీ టిల్లూ స్వ్కేర్ సినిమా చేశాడు. సిద్దు ఎంతో న‌మ్మి చేసిన టిల్లూ స్వ్కేర్ ఇప్పుడు బాక్సాఫీస్ వ‌ద్ద అద్భుతాలు సృష్టిస్తోంది.

ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే టిల్లు స్వ్కేర్ కు హౌస్ ఫుల్స్ ప‌డుతున్నాయి. వీకెండ్ లో ఈ సినిమాకు టికెట్స్ దొర‌క‌డం కూడా క‌ష్ట‌మైంది. ఆదివారం కూడా అన్ని షోల‌కు మంచి ఆక్యుపెన్సీ ఉంది. ఇప్ప‌టికే టిల్లు స్వ్కేర్ గ్రాస్ రూ.50 కోట్ల మార్క్ కు ద‌గ్గ‌ర‌గా ఉంది. ఈ సినిమాతో సిద్దు వంద కోట్ల మార్క్ ను అందుకున్నా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. చిన్న హీరో స్థాయి నుంచి మిడ్ రేంజ్ స్థాయికి ఎదిగాడు సిద్దు. త‌న‌కున్న టాలెంట్‌కు సిద్దూ ఇంకా పెద్ద స్థాయికి చేరే అవ‌కాశం కూడా ఉంది. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :