టెక్సాస్ లో సీతారామ ఫౌండేషన్ ఉత్సవాలు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో జరిగిన రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని టెక్సాస్‌లో శ్రీ సీతారామ ఫౌండేషన్ ప్రత్యేక ఉత్సవాన్ని నిర్వహించింది. గత శనివారం నుంచి ప్రారంభమైన ఈ వేడుకలకు పలువురు భారతీయ అమెరిక్లతో పాటు అమెరికన్ న్యాయమూర్తి జూలీ మాథ్యూస్, గ్రేటర్ హ్యూస్టన్ ప్రాంతంలోని అన్ని ఆలయాల అర్చకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తీవ్రమైన చలిని సైతం లెక్కచేయకుండా వీరంతా ఉత్సాహంగా రామాలయ సంబరాల్లో పాల్గొంటున్నట్లు సీతారామ ఫౌండేషన్ అధ్యక్షుడు అరుణ్ వర్మ తెలిపారు. కీర్తనలతో మొదలైన సంబరాల్లో సుందరకాండ ప్రవచనం, రామలీల, రామభజన, హోమం, రామ పట్టాభిషేకం జరిగాయి. తరువాత నిర్వహించిన రాముని ఊరేగింపులో అయోధ్య నుంచి ప్రత్యేకంగా విమానంలో తెచ్చిన ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు.
Tags :