ASBL Koncept Ambience
facebook whatsapp X

ఆ సినిమాను రానాతో త‌ప్ప మ‌రెవ‌రితోనూ చేయ‌ను: శేఖ‌ర్ క‌మ్ముల

ఆ సినిమాను రానాతో త‌ప్ప మ‌రెవ‌రితోనూ చేయ‌ను: శేఖ‌ర్ క‌మ్ముల

రానా మొద‌టి సినిమాగా లీడర్ కు స్పెష‌ల్ ఫాలోయింగ్ ఉంది. బాక్సాఫీస్ వ‌ద్ద బీభ‌త్స‌మైన వ‌సూళ్ల‌ను సాధించ‌క‌పోయినా ఆ రోజుల్లో ఈ సినిమా చేసిన సంద‌డి వేరు. థియేట‌ర్ల‌లో కంటే ఈ సినిమా సీడీలు, టీవీల్లో వ‌చ్చాక మంచి ఆద‌ర‌ణ అందుకుంది. 2010లో రిలీజైన ఈ సినిమా వ‌చ్చే సంవ‌త్సారానికి 15 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది.

అయితే ఈ సినిమాకు సీక్వెల్ కావాల‌ని ఎంతో మంది గ‌త కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. అప్ప‌ట్లో శేఖ‌ర్ క‌మ్ముల ఈ సీక్వెల్ గురించి అడిగితే మాట దాటేశాడు కానీ రీసెంట్ గా హ్యాపీ డేస్ రీ రిలీజ్ సంద‌ర్భంగా మాత్రం త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టాడు. లీడ‌ర్ సినిమా త‌న కెరీర్లోనే స్పెష‌ల్ మూవీ అని, అప్ప‌ట్లో ల‌క్ష కోట్ల అవినీతి అంటే చాలా మంది న‌మ్మ‌లేద‌ని, కానీ ఇప్పుడు అది చాలా నార్మ‌ల్ విష‌యం అయిపోయింద‌న్నాడు.

అంతేకాదు, వ‌ర్త‌మాన రాజ‌కీయాలు అంత‌కంటే దారుణంగా త‌యార‌య్యాయ‌ని చెప్పిన శేఖ‌ర్ క‌మ్ముల‌, లీడ‌ర్ 2 కోసం త‌న మ‌న‌సులో ఓ పాయింట్ ను అనుకున్న‌ట్లు చెప్పాడు. స్క్రిప్ట్ రెడీ అయితే స‌రైన టైమ్ లో రానాతోనే తీస్తాన‌ని క్లారిటీ ఇచ్చాడు. త‌న కెరీర్లో స్పెష‌ల్ సినిమాగా నిలిచిన లీడ‌ర్ లో రానాను త‌ప్ప మ‌రో హీరోని ఊహించుకోలేన‌ని శేఖ‌ర్ క‌మ్ముల చెప్పుకొచ్చాడు. శేఖ‌ర్ క‌మ్ముల చెప్పిన దాన్ని బ‌ట్టి చూస్తే ఫ్యాన్స్ లీడ‌ర్2 కోసం వెయిట్ చేయొచ్చ‌నే అనిపిస్తుంది.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :