ASBL NSL Infratech

నాట్స్‌ సంబరాల్లో శకపురుషుల శతవత్సర సంరంభం

నాట్స్‌ సంబరాల్లో శకపురుషుల శతవత్సర సంరంభం

న్యూజెర్సిలో నాట్స్‌ ఆధ్వర్యంలో మే 26 నుంచి 28 వరకు అంగరంగ వైభవంగా జరిగే  అమెరికా తెలుగు సంబరాల్లో వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు వైభవంగా జరిగే ఈ సంబరాలు ఎడిసన్‌లోని న్యూజెర్సి కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పొజిషన్‌ సెంటర్‌లో జరగనున్నాయి. 

శకపురుషుల శతవత్సర సంరంభం పేరుతో పలు కార్యక్రమాలను కూడా సంబరాల ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్‌, ఘంటసాల, అల్లురామలింగయ్య వారిని స్మరించుకుంటూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అజరామర ధీశాలి పేరుతో ఎన్టీఆర్‌కు నివాళులు అర్పిస్తూ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గానామృత జయంత్యుత్సవం పేరుతో ఘంటసాలకు నివాళులు ఇస్తూ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఘంటసాల పాటలను పాడించనున్నారు. శతాబ్ది వైభవం పేరుతో అల్లు రామలింగయ్య చేసిన నటనను గుర్తు చేసుకుంటూ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. 

ఈ శతవత్సర సంరంభంలో దృశ్య శ్రవణ రూపకాలు, ప్రముఖుల ప్రసంగాలు, నృత్య ప్రదర్శనలు, నాటక ప్రదర్శనలు కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :