బాలీవుడ్ సూపర్ స్టార్ మరో ఘనత

బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ మరో ఘనత సాధించారు. ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ ప్రకటిచిన టాప్-100 అత్యంత ప్రభావశీలుర జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఈ పోలింగ్‌లో దాదాపు 12 లక్షల మంది ఓట్లు వేయగా, అందులో 4 శాతం ఓట్లు షారుఖ్‌కు దక్కాయి. ఇరాన్‌కు చెందిన మహిళా ఉద్యమకారులు 3 శాతం ఓట్లతో రెండో స్థానం దక్కించుకొన్నారు. బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్ మూడు, నాలుగు స్థానాల్లో అర్జెంటీనా పుట్‌బాల్ ఆటగాడు మెస్సీ ఐదో స్థానంలో నిలిచారు.







Tags :