5 నెలల్లో బీఆర్ఎస్ భూస్థాపితం: షబ్బీర్ అలీ
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి 5 నెలలే టైం ఉందని, ఆ తర్వాత ఆ పార్టీ భూస్థాపితం కాబోతోందని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ సంచలన కామెంట్స్ చేశారు. గాంధీభవన్‌లో మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన షబ్బీర్ అలీ.. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీమ్‌గా పని చేస్తోందని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కున్న తన కుమార్తె కవితని బయటకు తెచ్చేందుకు కేంద్రంలోని బీజేపీతో కేసీఆర్ లాలూచీ ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు.
‘‘తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీంలా పనిచేస్తోంది. అది ప్రజలంతా గమనించే కాంగ్రెస్‌ను ఎన్నుకున్నారు. మరో 5 నెలల్లో ఆ పార్టీ భూస్థాపితం కావడం ఖాయం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. మా సర్కార్‌తో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లోనూ మమ్మల్నే ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఈ దఫా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 11 ఎంపీ సీట్లు గెలవబోతుంది. అందులో అనుమానమే లేదు.’’ అని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.