ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

సక్సెస్ తో దూసుకెళ్తున్న సీనియర్ హీరోలు...

సక్సెస్ తో దూసుకెళ్తున్న సీనియర్ హీరోలు...

సీనియర్ హీరోలు, యాభైల్లోకి అడుగుపెట్టారు, ఇక వీరి పని అయిపొయింది అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఎంత సీనియర్స్ అయినా, మంచి కంటెంట్, కథా, కథనం ఉంటే ఎలాంటి సినిమాకైనా ఆదరణ లభిస్తుందని ప్రేక్షకులు ఇప్పటికి నిరూపిస్తూనే ఉన్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా సీనియర్ హీరోలు హిట్స్ కొడుతుండడం విశేషం. వయసుతో సంబంధం లేకుండా వెండితెరపై దుమ్ము లేపుతున్నారు సీనియర్ హీరోలు.

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. కలెక్షన్ల విషయంలో సైతం తగ్గేదేలే అంటూ దూసుకుపోతుంది. 57 ఏళ్ళ వయసున్న హీరో బాలీవుడ్ ని తన సినిమా కలెక్షన్లతో ఒక ఊపు ఊపుతున్నాడంటే మామూలు విషయం కాదు. ఒక్క వారంలోనే 500 కోట్ల కల్లెక్షన్లని ఈ సినిమా క్రాస్ చేసింది. ఇక ముందు ముందు ఎన్ని రికార్డ్స్ ని నమోదు చేస్తుందో చూడాలి.

ఇక టాలీవుడ్ విషయానికి వస్తే ఒక వైపు మెగాస్టార్, మరోవైపు బాలయ్య బాబు తెలుగు చిత్ర పరిశ్రమని షేక్ చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో మరొక్కసారి వారి సత్తాని ప్రూవ్ చేసుకున్నారు ఈ హీరోలు. మూడు వారాలలోపే 200 కోట్ల గ్రాస్ ని దాటేయడమే కాక అల వైకుంఠపురములో సినిమా కలెక్షన్స్ ని టార్గెట్ చేస్తూ దూసుకుపోతోంది వాల్తేరు వీరయ్య సినిమా. 67 ఏళ్ళ వయసులో ఈ సినిమా ఇచ్చిన కిక్ ని ఎంజాయ్ చేస్తున్నారు మెగాస్టార్.

ఇక కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ కి విక్రమ్ సినిమా చాల బూస్ట్ అప్ ఇచ్చిందనే చెప్పాలి. గత కొన్ని సంవత్సరాలుగా సరైన హిట్ సినిమా లేక కమల్ హాసన్ కనుమరుగయ్యే స్థితికి వచ్చేసారు. రీసెంట్ గా రిలీజైన విక్రమ్ సినిమా ఈ సీనియర్ హీరోని నిలబెట్టింది. ప్రేక్షకుల నుండి విక్రమ్ కి మంచి రెస్పాన్స్ అందడంతో ఈ హీరో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ఇదే దారిలో సూపర్ స్టార్ రజిని కాంత్, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున వంటి సీనియర్  హీరోలు రెస్ట్ అనేది తీసుకోకుండా, ఈ జనరేషన్ తో పోటీ పడడం విశేషం.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :