ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఆస్కార్ అవార్డును ఇచ్చిన హాలీవుడ్ స్టార్

హాలీవుడ్ నటుడు, అమెరికాకు చెందిన షాన్ పెన్ తన ఆస్కార్ అవార్డులలో ఒకదానిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ఇచ్చారు. ఆ దేశ రాజధాని కీవ్‌ను సందర్శించి ఆస్కార్‌ను ఆయనకు బహుమతిగా అందజేశారు. ఈ విషయాన్ని జెలెన్‌స్కీ తన టెలిగ్రామ్ ఛానెల్‌లో పెన్‌తో కలిసి ఉన్న వీడియోను పోస్ట్ చేయడం ద్వారా తెలిపారు. అదే సమయంలో జెలెన్‌స్కీ తమ దేశ ఆర్డర్ ఆఫ్ మెరిట్ పురస్కారాన్ని పెన్‌కు ప్రదానం చేశారు. సీన్ పెన్ ప్రపంచ స్థాయి నటడిగానే కాకుండా రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా ఉంటున్నారు.
Tags :