ASBL NSL Infratech

2025 నాటికి ఈ రంగంలో 20 లక్షల మందికి శిక్షణ : సత్య నాదెళ్ల

2025 నాటికి ఈ రంగంలో 20 లక్షల మందికి శిక్షణ : సత్య నాదెళ్ల

భారత్‌లో 2025 కల్లా 20 లక్షల మందికి కృత్రిమ మేధ లో నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్‌ సీఈవో, చైర్మన్‌ సత్య నాదెళ్ల తెలిపారు. ముంబయిలో ఏఐ కోసం డేటా సైన్స్‌ రూపొందించే సంస్థ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐ విషయంలో భారత్‌-అమెరికా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ శక్తివంతమైన కొత్త సాంకేతికత. దాని గురించి ఆందోళన చెందకుండా, ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరింపచేయాలి. ఇందుకు అనుసరించాల్సిన విధి విధానాలు రూపొందించడంలో భారత్‌`అమెరికాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ భాగస్వామ్యం  ఇరుదేశాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. 2025 నాటికి ఈ రంగంలో భారత్‌ 20 లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇస్తాం. దేశ జీడీపీ పెరగడానికి ఏఐ దోహదపడుతుంది. ప్రస్తుతం అభివృద్ది చెందుతున్న మార్కెట్లలో భారత్‌ ఒకటి అని తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :