ASBL NSL Infratech

బాలారెడ్డి ఇందుర్తికి శంకరరత్న అవార్డు ప్రదానం

బాలారెడ్డి ఇందుర్తికి శంకరరత్న అవార్డు ప్రదానం

శంకర నేత్రాలయ ద్వారా ఎంతోమందికి కంటిచూపును అందించడంలో విశేషమైన సేవలను అందిస్తున్న అమెరికాలోని శంకర నేత్రాలయ ప్రెసిడెంట్‌ బాలారెడ్డి ఇందుర్తిని ప్రతిష్టాత్మకమైన శంకరరత్న అవార్డుతో ఇటీవల చెన్నైలోని శంకరనేత్రాలయలో జరిగిన కార్యక్రమంలో సత్కరించారు. 

పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత డా. ఎస్‌.ఎస్‌.బద్రీనాథ్‌ 1978లో శంకర నేత్రాలయను ఏర్పాటు చేశారు. పేదలకు ప్రపంచ స్థాయి కంటి వైద్యం ఉచితంగా  ఇతరులకు సరసమైన ధరలో అందించాలనే ఏకైక లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ శంకర నేత్రాలయ గత 46 సంవత్సరాలుగా మిలియన్ల మంది పేద రోగులకు కంటి చూపును ప్రసాదించింది. శంకర నేత్రాలయకు అవసరమైన నిధులను సేకరించాలన్న లక్ష్యంతో 1988లో అమెరికాలో కూడా ఏర్పాటు చేశారు. అమెరికాలోని తెలుగు కమ్యూనిటీలో ప్రముఖ వ్యక్తిగా పేరు పొందిన  బాల రెడ్డి ఇందుర్తి శంకర నేత్రాలయ యుఎస్‌ఎలో ట్రస్టీగా చేరి భారతదేశంలోని పేద రోగులకు కంటి వైద్యసేవలను అందించడానికి కృషి చేశారు.

తామా, ఎపిఎన్‌ఎ, నాటా, వంటి ప్రముఖ తెలుగు సంఘాల్లో బాలారెడ్డి ఇందుర్తి కీలకపాత్ర పోషించారు. ఆ సంస్థల్లో కూడా నిధులు సేకరించి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించాడు. 2019 అధ్యక్షుడై సంస్థను మరింతమందికి సేవలందించే దిశగా నడిపించారు. అలాగే అమెరికాలోని వివిధ నగరాల నుండి చాలా మంది ట్రస్టీలు, వాలంటీర్లను తీసుకురావడంలో కూడా బాలారెడ్డి కీలక పాత్ర పోషించారు. శంకర నేత్రాలయను అమెరికా అంతటా విస్తరించడంలో కృషి చేసి ఎంతోంమందిని శంకర నేత్రాలయ ద్వారా సేవ చేసేలా చూశారు. ఆయన ప్రెసిడెంట్‌ కాక ముందు శంకర నేత్రాలయకు ఇండియాలో 2 మొబైల్‌ ఐ సర్జికల్‌ యూనిట్లు మాత్రమే ఉన్నాయి.

హైదరాబాద్‌లో కూడా మొబైల్‌ ఐ సర్జికల్‌ యూనిట్‌ ను ఏర్పాటు చేసి వైద్య సేవలను మరింతగా విస్తరించారు. బాలా రెడ్డి ఇందుర్తిని 2023 సంవత్సరానికి శంకరరత్న అవార్డుతో సత్కరించింది. శంకర నేత్రాలయ చెన్నై ప్రధాన ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ముఖ్య అతిథిగా విచ్చేసిన తమిళనాడు ప్రభుత్వ అధికారి గగన్‌దీప్‌ సింగ్‌ బేడీ, ఐఎఎస్‌ బాలా రెడ్డి ఇందుర్తికి  అందించారు.

ఈ కార్యక్రమానికి భారత మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు గౌరవ అతిథిగా హాజరయ్యారు. డా.టి.ఎస్‌. సురేంద్రన్‌, చైర్మన్‌, శంకర నేత్రాలయ, జి.రామచంద్రన్‌, కార్యదర్శి, మెడికల్‌ రీసెర్చ్ ఫౌండేషన్‌, మెడికల్‌ రీసెర్చ్ ఫౌండేషన్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ గిరీష్‌ రావు తదితరులు కూడా హాజరయ్యారు.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :