ASBL NSL Infratech

డార్లింగ్ కొట్టేశాడా...? కింగ్ ఖాన్ హవానా..?

డార్లింగ్ కొట్టేశాడా...? కింగ్ ఖాన్ హవానా..?

సలార్ వర్సెస్ డంకీలో గెలుపెవరిది..? డార్లింగ్ బాక్స్ బద్దలు చేశాడా..? కింగ్ ఖాన్ హ్యాట్రిక్ సాధించాడా..? బాక్సాఫీసును కొల్లగొట్టేదెవరు..?. ఓవైపు కింగ్ ఖాన్ షారూక్.. పఠాన్, జవాన్ హిట్స్ తర్వాత డంకిలో నటించారు. వరుసగా రెండు హిట్లు సాధించి సూపర్ ఫామ్ మీదున్న షారూక్ నటించిన డంకి.. సూపర్ హిట్ అవుతుందని బాలీవుడ్ అభిమానులు, క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రాజ్ కుమార్ హిర్.. గత సినిమాల ట్రాక్ రికార్డు చూస్తే.. ఈసినిమా కచ్చితంగా హిట్టేనని అభిమానులు నమ్ముతున్నారు. అయితే ఇటీవలే విడుదలైన ప్రభాస్ సినిమా సలార్.. డంకీకి గట్టి పోటీగా మారిందన్న టాక్ నడుస్తోంది.

సలార్ సినిమాలో.. ప్రభాస్, సుకుమారన్ నటన.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ వెరసి ఓ పవర్ ఫుల్ ప్యాక్ లా ప్రజల ముందుకొచ్చింది. దీంతో సౌత్ తో పాటు నార్త్ ఆడియెన్స్ సైతం.. సలార్ కు బ్రహ్మరథం పడుతున్నట్లు కనిపిస్తోంది. ఇది కొంత కాకున్నా కొంతైనా డంకి వసూళ్లపై ప్రభావం చూపిస్తోంది. దీంతో అటు సలార్, ఇటు డంకి మధ్య సినీసమరం ఆసక్తికరంగా మారింది. షారూక్, ప్రభాస్ అభిమానులు.. సోషల్ మీడియా వేదికగా పెడుతున్న పోస్టింగులు .. దీనికి అద్దం పడుతున్నాయి.

డంకీ ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ చేయగా... సలార్ మాత్రం పక్కా మాస్ ఫిల్మ్.. దీంతో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సలార్ దే పైచేయి అవుతుందన్న అంచనాలున్నాయి. ఇది బాలీవుడ్ ప్రేమికులు, క్రిటిక్స్ కు కాస్త బాధ కలిగిస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో తమ హీరో సినిమా సూపర్ గా ఉందంటూనే.. సలార్ ప్లాప్ షో అంటూ మౌత్ టాక్ తో పాటు సోషల్ మీడియాలోనూ పోస్టులు వైరల్ చేస్తున్నారు. దీనిపై డార్లింగ్ అభిమానులుసైతం తగ్గేదే లేదంటున్నారు. తమ హీరో సినిమాకు థియేటర్లు దొరక్కుండా బాలీవుడ్ మాఫియా చేసిందని ఘాటుగానే విమర్శిస్తున్నారు. అయినా ప్రభాస్, ప్రశాంత్ నీల్ స్టామినా ఏంటో బాలీవుడ్ కు ఈసారి తెలిసిందంటున్నారు.

ఎవరు ఎంతలా ప్రయత్నించినా, ప్రచారం చేసినా... సరుకున్న సినిమానే హిట్టవుతుందన్నది చరిత్ర చెప్పిన సత్యం. ఈ రెండు సినిమాల్లో ఏది ప్రేక్షకుడికి చేరువైతే అదే గెలుస్తుంది. నిలుస్తుంది. ఈవిషయం తెలిసి కూడా ఇంతలా అభిమానులు దిగజారి.. ప్రవర్తించడం బాధాకరమని చెప్పాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :