ట్రైలర్ తో మెప్పిస్తున్న చక్రవ్యూహం, గ్రాండ్ లాంచ్ చేసిన సాయిధరమ్ తేజ్

ట్రైలర్ తో మెప్పిస్తున్న చక్రవ్యూహం, గ్రాండ్ లాంచ్ చేసిన సాయిధరమ్ తేజ్

మెగా హీరో సాయిధరమ్ తేజ్ విరూపాక్ష తో సంచలన విజయం సాధించారు. ప్రస్తుతం తన తదుపరి చిత్రాల మీద ఫోకస్ పెట్టారు. ఇక ఈరోజు మరొక చిత్రం చక్రవ్యూహం - ది ట్రాప్ ( ఉప శీర్షిక ) ట్రైలర్ ను గ్రాండ్ రిలీజ్ చేసారు. విలక్షణ పాత్రలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అజయ్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు.  

మిస్టరీ క్రైమ్ నేపథ్యంలో సాగే ఈ కథని మధుసూదన్ దర్శకత్వంలో శ్రీమతి సావిత్రి గారు సహస్ర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ పూర్తిచేసుకొని జూన్ 2 న  థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది.  విరూపాక్ష చిత్రం లో అజయ్ పాత్ర నిడివి తక్కువే అయినా తన నటనతో మెప్పించారు. సినిమా  సినిమాకి అందులో ఉన్న పాత్రకి తగ్గట్టు బాడీ లాంగ్వేజ్ మరియు హవా భావాలతో తగిన న్యాయం చేస్తూ ఎదిగిన నటుడు అజయ్ ఈ క్రైమ్ స్టోరీ లోను అదే రీతిన ప్రేక్షకుల మెప్పు పొందుతారు అనడం లో సందేహం లేదు.

ట్రైలర్ లోకి వెళ్తే మొదటి నుంచి చివర  దాక మొత్తం సస్పెన్స్ ని రేకెత్తిస్తూ సాగింది. ముఖ్యంగా బాక్గ్రౌండ్ స్కోర్ వాళ్ళ కథపై ఆసక్తి పెరిగింది. మరోసారి అజయ్ తన అద్భుతమైన నటన కనపరిచాడు. కొద్దీ రోజుల క్రితం రిలీజ్ అయినా టీజర్ కూడా ప్రేక్షుకులను ఆకట్టుకుంది. చిత్ర తారాగణం విషయానికి వస్తే అజయ్ తో పాటు   జ్ఞానేశ్వరి, వివేక్ త్రివేది, ఊర్వశి పరదేశి, ప్రజ్ఞా నయన్, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, ప్రియ, శ్రీకాంత్ అయ్యంగార్, కిరీటి, రాజ్ తిరందాసు, రవితేజ, మోహన్ నటించారు.

జూన్ 2 న రిలీజ్ అవుతున్న ఈ సినిమా నైజం సీడెడ్ హక్కులని మైత్రీ  మూవీ డిస్ట్రిబ్యూషన్ శశిధర్ రెడ్డి కొనుగోలు చేసారు. ట్రైలర్ ద్వారా వస్తున్న రెస్పాన్స్ చూసి చిత్ర బృందం ఎంతో  ఆనందంగా ఉన్నారు. థియేటర్స్ లో  రిలీజ్ అయ్యాక కూడా పాజిటివ్  రెస్పాన్స్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది చిత్ర యూనిట్ . భరత్ మంచిరోజు మ్యూజిక్ డైరెక్టర్ గ స్వరాలను అందించారు.

 

 

 

praneet obili-garuda AHA poulomi Png-jewelry aurobindo MUPPA
Tags :