ఆర్కే ఎంట్రీ తో మంగళగిరి టఫ్ ఫైట్..
టీడీపీ యువ నాయకుడు, చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేతిలోకి తీసుకొని పార్టీని ముందుకు నడిపించాల్సిన అభ్యర్థి నారా లోకేష్. అయితే ప్రస్తుతం రాబోయే ఎన్నికలు అతని రాజకీయ భవిష్యత్తును తేలుస్తాయి అన్నమాట గట్టిగా వినిపిస్తోంది. 2019లో ఆయన 5000 ఓట్ల తేడాతో ఓటమి పాలు అయ్యారు. ఈసారి ఎన్నికల్లో గెలవాలి అని గట్టిగా ప్రయత్నిస్తున్నప్పటికీ పరిస్థితులు కాస్త భిన్నంగా కనిపిస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఆయన విజయం కన్ఫామ్ అని కొందరు వాదిస్తుంటే మరికొందరు మాత్రం ఎన్నో అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. తాజా వార్తలు ప్రకారం మంగళగిరిలో లోకేష్ ఫైట్ అంత ఈజీ కాదు అన్న వాదన వినిపిస్తోంది. వస్తున్న వార్తల ప్రకారం నారా లోకేష్ హోరా హోరీ పోరు తప్పదు అన్న విషయం మాత్రం కన్ఫామ్. ఆళ్ళ రామక్రిష్ణారెడ్డి అలియాస్ ఆర్కే వైసీపీ ఎంట్రీతో మంగళగిరి వాతావరణం ఒక్కసారి మారిపోయింది. మొత్తం ఎన్నికల ప్రచారం తన భుజాన వేసుకొని పార్టీని ముందుకు నడిపిస్తున్నాడు ఆర్కే. దీంతో ఇప్పటివరకు టీడీపీ వైపు కనిపించిన పరిస్థితులు ఒక్కసారి రివర్స్ అవుతున్నాయనిపిస్తోంది.