ASBL NSL Infratech

తెలంగాణ బానిసత్వాన్ని భరించదు.. సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణ బానిసత్వాన్ని భరించదు.. సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి నేటికి దశాబ్దం పూర్తయింది అని సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్స్ లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆవిర్భావ దశాబ్ద వేడుకలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జై తెలంగాణ నినాదంతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి.. నాలుగు కోట్ల ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినం ఈరోజు అని పేర్కొన్నారు. ఆనాడు స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. అంతేకాదు ఆరు దశాబ్దాల కలను సాకారం చేసిన నాటి ప్రధాని..యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాకు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

తెలంగాణలో ప్రజలు తమ జీవనశైలి స్వేచ్ఛతో ఉండాలి అని భావిస్తారని బానిసత్వాన్ని తెలంగాణ ఎప్పటికీ భరించదని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రేమను పంచడం.. పెత్తందారితనాన్ని ప్రశ్నించడం తెలంగాణ ప్రజల మనస్తత్వమని.. సంక్షేమం ముసుగులో తెలంగాణను చరబట్టాలని చూస్తే సమాజం సహించదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు అన్ని తమకే తెలుసు.. తామే సర్వజ్ఞానులం అన్న భ్రమలు తమకు లేవని రేవంత్ రెడ్డి ఇన్ డైరెక్ట్ గా కేసీఆర్ కు చురకలు అంటించారు.

తమ ప్రభుత్వ పాలనలో ఏదైనా పదిమందిని సంప్రదించి.. అందరి సలహాలు, సూచనలు స్వీకరించి.. పార్టీ నేతలతో చర్చించి ముందుకు వెళ్తామని రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యమ లక్ష్యాలు, అమరవీరుల ఆశయాలు సాధించిన నాడే నిజమైన తెలంగాణ సాధించినట్లని.. అప్పుడే తెలంగాణ ఆవిర్భావానికి నిజమైన సార్ధకత వస్తుందన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో జరగబోయే పురోగతికి ఈ దశాబ్ది ఉత్సవం అనేది కేవలం ఒక మైలురాయి అని ఆయన పేర్కొన్నారు.

తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో మార్పులు చేపట్టామని.. మునుముందు ప్రజల సంక్షేమం కోసం మరిన్ని మార్పులు తేవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్షానికి గౌరవం ఇవ్వడంతో పాటు మీడియాకి కూడా తమ ప్రభుత్వం స్వేచ్ఛ ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు. పెరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. అనంతరం జయ జయహే తెలంగాణ గీతాన్ని విడుదల చేశారు. ఈ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందె శ్రీ రచించగా, సంగీత దర్శకుడు కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. అనంతరం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అందించిన సందేశాన్ని కూడా ప్రదర్శించారు. ఆమె ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :