ASBL NSL Infratech

ఓవైపు లోక్ సభ ఎన్నికలు.. మరోవైపు ఆపరేషన్ ఆకర్ష్..

ఓవైపు లోక్ సభ ఎన్నికలు.. మరోవైపు ఆపరేషన్ ఆకర్ష్..

మొన్నటివరకూ మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం.. అని బీఆర్ఎస్, బీజేపీలు వార్నింగులిచ్చాయి. బీఆర్ఎస్ లీడర్లైతే మేం కనుసైగ చేస్తే అన్నట్లుగా మాట్లాడారు. కేటీఆర్, హరీశ్ రావు.. ఎన్నో నెలలు ఈప్రభుత్వం ఉండదు అన్నట్లు కామెంట్స్ చేశారు. అయితే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించేసరికి.. గులాబీ పార్టీలో కుదుపు మొదలైంది. కడియం, కేకే లాంటి హేమాహేమీలు పార్టీ ఫిరాయించేసరికి.. ఇప్పుడేం చేయాలో ఆపార్టీకి అర్థం కావడం లేదు. నమ్మినవారు ద్రోహం చేశారంటూ ఆరోపణలు గుప్పించడం, మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం తప్పా ఇంకేమీ చేయలేని నిస్సహాయస్థితికి చేరింది కారు పార్టీ.

సీఎం రేవంత్ రెడ్డి...గేట్లెత్తేశాం... ఇక రావొచ్చు అనడమే తరువాయి. నేతలందరూ క్యూ కడుతున్నారు.ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. కాంగ్రెస్ పాతకాపులు, రేవంత్ రెడ్డితో పరిచయమున్న టీడీపీ బ్యాచ్.. కదలిపోతోంది. కాంగ్రెస్ హైకమాండ్ తో పాతపరిచయాలు కలుపుకుంటూ మాజీ నేతలు వస్తుంటే.. రేవంత్ రెడ్డి పరిచయాలతో టీడీపీ నేతలు హస్తం పార్టీలో చేరుతున్నారు. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ కాస్తా, కాంగ్రెస్ టీడీపీలా కనిపిస్తోంది. మరోవైపు.. బీజేపీలో కూడా ఆపరేషన్ ఆకర్ష్ భయం కనిపిస్తోంది. ఇటీవలే బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి సైతం...మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. మా నేతలను టచ్ చేస్తే .. మీ ప్రభుత్వం కూలుతుందని హెచ్చరికలు జారీచేశారు.అంతలోనే తమనేతలు అలాంటి వాళ్లు కాదంటూ కవరింగ్ చేశారు. అంతే కాదు.. మంత్రి కోమటిరెడ్డిలా ఐదుగురు మంత్రులు తమతో టచ్ లో ఉన్నారన్నారు. కోమటిరెడ్డికి తన తమ్ముడే టచ్ లో లేడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ప్రస్తుతం పరిస్థితి చూస్తే.. ఎప్పుడు ఏనేత హస్తం గూటికి చేరతారో అన్న భయం ఆయా పార్టీలను వెన్నాడుతోంది.అయితే నాడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సమయంలో కేసీఆర్.. పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు చేపట్టారో..ఇప్పుడు రేవంత్ సైతం అదే ఒరవడి కంటిన్యూ చేస్తున్నారు. దీంతో తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చూసుకోవడంపై పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఇదే సమయంలో లోక్ సభ ఎన్నికల్లో గెలుపుపై ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది కాంగ్రెస్.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :