ASBL NSL Infratech

2024 సార్వత్రిక ఎన్నికలే టార్గెట్ గా రేవంత్..

2024 సార్వత్రిక ఎన్నికలే టార్గెట్ గా రేవంత్..

తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి... లోక్ సభ ఎన్నికలు, తాము ఇచ్చిన హామీల అమల సహా కీలకాంశాలకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. గత ప్రభుత్వహయాంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన అధికారులు, సలహాదారులు సహా అందరినీ మార్చివేస్తున్నారు. అంటే.. తన టీమ్ తయారు చేసుకుంటున్నారు. తాను చెప్పింది గ్రౌండ్ లెవల్లో కచ్చితంగా అమలయ్యేలా తగిన చర్యలు చేపడుతున్నారు.

రేవంత్ మార్క్ డెసిషన్స్..

వివిధ కార్పొరేషన్లు, సంస్థలకు గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ఛైర్‌పర్సన్లు, వైస్‌ఛైర్‌పర్సన్ల పదవులను, కొందరి పదవీకాలం పొడిగింపును ప్రభుత్వం రద్దు చేసింది. ఛైర్‌పర్సన్లు, వైస్‌ఛైర్‌పర్సన్ల వ్యక్తిగత సహాయకులుగా పొరుగుసేవలు, ఒప్పంద ప్రాతిపదికన నియమితులైన సిబ్బందిని కూడా తొలగించింది. వ్యక్తిగత సహాయకులు, కార్యదర్శులు, ఓఎస్డీలుగా పనిచేస్తున్న ప్రభుత్వ సిబ్బందిని సంబంధిత విభాగాలకు బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే పలువురు కార్పొరేషన్ల ఛైర్మన్లు తమ పదవులకు రాజీనామా చేశారు. మరికొందరు పదవుల్లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో వారందరి నియామకాలను ప్రభుత్వం రద్దు చేసింది. మరోవైపు ఇప్పటికే పదవీ విరమణ చేసినప్పటికీ ఇంకా వివిధ విభాగాల్లో కొనసాగుతున్న ఉద్యోగుల వివరాలను సేకరిస్తోంది. ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పదవీ విరమణ చేసినా.. ఇంకా సర్వీసులో కొనసాగుతున్న ఉద్యోగుల వివరాలు ఆరా తీస్తోంది.

ఇటీవలే.. గత ప్రభుత్వం నియమించిన ప్రభుత్వ సలహాదారుల నియామకాలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నియమించిన సలహాదారుల నియామకాలు రద్దుచేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీచేశారు. .బీఆర్ఎస్ సర్కార్ హయాంలో చక్రం తిప్పిన సోమేష్‌ కుమార్‌, చెన్నమనేని రమేష్‌, రాజీవ్‌ శర్మ, అనురాగ్‌ శర్మ, ఏకే ఖాన్‌, జీఆర్‌ రెడ్డి, ఆర్‌.శోభ నియామకాలను రద్దు చేసింది తెలంగాణ ప్రభుత్వం.

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీకి కసరత్తు జరుగుతోంది. చురుగ్గా నిర్ణయాలు తీసుకుని సమర్ధవంతంగా, పారదర్శికంగా పని చేసే శక్తి సామర్థ్యాలు కలిగిన అధికారులకు కీలక పదవులు దక్కే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు, ఎన్నికల హామీలు అమలు చేసేందుకు వీలుగా కూడా ఈ బదిలీలు, నియామకాలు ఉంటాయని తెలుస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :