Radha Spaces ASBL

తెలంగాణలో అధికారంలోకి కాంగ్రెస్ : రేణుకా చౌదరి

తెలంగాణలో అధికారంలోకి కాంగ్రెస్ : రేణుకా చౌదరి

తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్‌ గాలి వీస్తోందని ఆ పార్టీ సీనియర్‌ నేత రేణుకా చౌదరి పేర్కొన్నారు. ఖమ్మంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ  తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే సీట్లను ఖచ్చితంగా గెలుస్తామన్నారు. సీఎం ఎవరనేది గెలిచిన ఎమ్మెల్యేలు, అధిష్ఠానం నిర్ణయిస్తారని తెలిపారు. డీకే శివకుమార్‌లా పదవిని త్యాగం చేసే గుణం అందరిలో ఉండాలంటూ సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో నేను పోటీ చేయాలని, ప్రచారం చేయాలని ఆహ్వానం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో నరకం అనుభవిస్తున్నారు. విభజన జరిగినా సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ తీరు సరిగా లేదు. అంత అవసరమా అంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకి అనేది  అందరికి తెలుసంటూ పేర్కొన్నారు. ఇక్కడ తెలుగుదేశం పోటీ చేయకుండా కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు తెలపడం సంతోషకరమన్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఎఫెక్టు పడిందన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :