Radha Spaces ASBL

రవితేజ సినిమాలో బద్రి బ్యూటీ..!

రవితేజ సినిమాలో బద్రి బ్యూటీ..!

రేణు దేశాయ్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. పవన్ నుండి విడిపోయిన తర్వాత ఒక ఇండిపెండెంట్ విమెన్ గా ఉంటూ ఇద్దరు పిల్లల్ని పెంచుతున్న మహిళ. ఎప్పటికప్పుడు తనని తాను అప్డేట్ చేస్కుంటూ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటుంది ఈ బద్రి బ్యూటీ. ఒక సినిమాకి దర్శకత్వం వహించాలని నా కోరిక అంటూ చాల సార్లే చెప్పింది రేణు దేశాయ్. ఎందుకో గాని పలు కారణాల వల్ల ఆ ప్రయత్నం ముందుకి సాగలేదు. ఈ మధ్య కాలంలో కొన్ని బుల్లితెర షోస్ లో తళుక్కుమన్న ఈమె, కొన్ని వెబ్ సిరీస్ లో కూడా నటించింది.

ఆధ్య అనే వెబ్ సిరీస్ ని కూడా ప్రారంభించింది కానీ ఇది కూడా మధ్యలోనే ఆగిపోయింది. పవన్ తో నటించిన జానీ సినిమా తర్వాత రేణు దేశాయ్ మళ్ళీ వెండితెరపై కనిపించలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న " టైగర్ నాగేశ్వర్ రావు " సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గా రేణు ఈ సినిమాకి సంబంధించి తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది.

ఈ సినిమాలో "హేమలత లవణం" అనే పాత్రలో రవితేజతో తాను నటిస్తున్నట్లు, సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టు ఆమె తెలిపారు. ఇంత మంచి క్యారెక్టర్ ని, పవర్ ఫుల్ రోల్ ని ఇచ్చినందుకు రేణు దేశాయ్ డైరెక్టర్ వంశీ కృష్ణకు థాంక్స్ చెప్పింది. షూటింగ్ సమయంలో యూనిట్ అంత ఒక ఫ్యామిలీగా కలిసిపోయామని, ఎంతో కంఫర్ట్ గా ఫిల్ అయ్యానని ఆమె వివరించింది. తన పాత్రకు సంబంధించిన షూటింగ్ జరిగే ప్రతీ క్షణం ఎంజాయ్ చేశానంటూ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఈ చిత్ర షూటింగ్ అనుభవాలని అభిమానులతో పంచుకుంది రేణు దేశాయ్.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :