అమెరికాలో తుఫాన్ బీభత్సం
అమెరికాలో తుపానులు మోసుకొచ్చిన కుండపోత వర్షాలతో కాలిఫోర్నియా దక్షిణ ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షకాల సీజన్ మొత్తం కురువాల్సిన వర్షపాతం కేవలం రెండ్రోజుల్లోనే పడి లాస్‌ఏంజెలెస్‌ను పూర్తిగా ముంచెత్తింది. దీంతో కొండచరియలు విరిగి పడే ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు దాదాపు 3 సెంటీమీటర్ల మేర వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. తుపానుకు కాలిఫోర్నియాలో ముగ్గురు బలయ్యారు. ఎడతెగని వానలు లాస్‌ఏంజెలెస్‌నూ ముంచెత్తియి. ఇక్కడ వార్షిక సగటు వర్షపాతం 36 సెంటీమీటర్లయితే ఒక్క సోమవారమే 18 సెంటీమీటర్ల మేర కురిసింది. మంచు, హిమపాతం నేపథ్యంలో కాలిఫోర్నియాలోని 8 కౌంటీల్లో ఎమర్జెనీ విధించారు.
Tags :