ASBL NSL Infratech

గుణ‌శేఖ‌ర్ రూట్ మార్చ‌డానికి కార‌ణ‌మిదేనా?

గుణ‌శేఖ‌ర్ రూట్ మార్చ‌డానికి కార‌ణ‌మిదేనా?

డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ ఎన్నో మంచి మంచి సినిమాల‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయ‌న పేరు చెప్ప‌గానే వెంట‌నే ఒక్క‌డు, చూడాల‌ని ఉంది సినిమాలు గుర్తొస్తాయి. అంతేకాదు, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ను బాల‌న‌టుడిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసింది కూడా ఆయ‌నే. కానీ ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ను వ‌రుస ఫ్లాపులు వెనుక‌బ‌డేలా చేశాయి. ఎంతో క‌ష్ట‌ప‌డి రుద్ర‌మ‌దేవి చేస్తే దానికి మంచి రిజ‌ల్టే వ‌చ్చింది కానీ రావాల్సిన స్థాయిలో అయితే గుర్తింపు రాలేదు. ఇక శాకుంత‌లం గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. విషాదం ఉన్న ఇతిహాస క‌థ‌ల‌ను ఎంత ఎక్కువ బ‌డ్జెట్ పెట్టి తీసినా ఆడియ‌న్స్ వాటి వంక చూడ‌ర‌ని గుర్తించ‌క‌పోవ‌డం వ‌ల్లే ఆ సినిమా న‌ష్టాల‌ను మిగిల్చింది.

శాకుంత‌లం ఇచ్చిన షాక్ కు తాను ఎంతో ఇష్ట‌ప‌డి రాసుకున్న హిర‌ణ్యక‌సిప సినిమాను ప‌క్క‌న పెట్టాడు గుణ‌శేఖ‌ర్. ఇప్పుడు పూర్తిగా రూటు మార్చి యుఫోరియా అనే కొత్త సినిమాతో ఆడియ‌న్స్ ను మెప్పించాల‌ని చూస్తున్నాడు. ఈ సినిమా త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంది. స‌న్నిహిత వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో అంతా కొత్త‌వాళ్లే ఉంటార‌న తెలుస్తోంది. యూత్ ఫుల్ కంటెంట్ తో గుణ‌శేఖ‌ర్ ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నాడ‌ట‌. అయితే స‌డెన్ గా గుణ‌శేఖ‌ర్ త‌న రూటు మార్చ‌డానికి కార‌ణం త‌న‌ను తాను ఆడియ‌న్స్ ద‌గ్గ‌ర ప్రూవ్ చేసుకోవాల‌నుకోవ‌డ‌మేన‌ని తెలుస్తోంది. అందుకే త‌క్కువ బ‌డ్జెట్ లో ఈ సినిమాను పూర్తి చేయాల‌ని చూస్తున్నాడ‌ట గుణ‌శేఖ‌ర్. 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :