ASBL NSL Infratech

అల్లు అర్జున్- అట్లీ.. అస‌లు మ్యాట‌ర్ ఇది!

అల్లు అర్జున్- అట్లీ.. అస‌లు మ్యాట‌ర్ ఇది!

పుష్ప‌2 త‌ర్వాత లేట్ లేకుండా అల్లు అర్జున్- అట్లీ కాంబినేష‌న్ లో సినిమా సెట్స్ పైకి వెళ్తుంద‌నుకుంటే స‌డెన్ గా ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది. దానికి కార‌ణం డైరెక్ట‌ర్ రెమ్యూన‌రేష‌న్ అని అంతా అనుకున్నారు కానీ దాని వెనుక అస‌లు కార‌ణం వేరే ఉంద‌ని తెలుస్తోంది. బ‌న్నీ కోసం అట్లీ రాసుకున్న క‌థ‌లో ఇద్ద‌రు హీరోల‌కు స్కోప్ ఉంద‌ట‌.

ఇద్ద‌రి హీరోల‌కీ స్క్రీన్ స్పేస్ స‌మానం కాక‌పోయినా ప్ర‌ధాన్య‌త విష‌యంలో ఒక‌టే ఉండేలా క‌థ‌ను అట్లీ రాసుకున్నాడ‌ట‌. క‌థ మొత్తం రెడీ అయ్యాక బ‌న్నీ ఒప్పుకుంటే మ‌రో బాలీవుడ్ స్టార్ ను ఒప్పించి సినిమా కు మంచి క్రేజ్ తీసుకొద్దామ‌ని అట్లీ అనుకున్నాడు. కానీ నేష‌న‌ల్ లెవెల్ లో గుర్తింపు వ‌చ్చాక ఏ హీరోనైనా మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేయాలంటే ఎంతో ఆలోచిస్తారు.

ఆర్ఆర్ఆర్ సినిమాలో రాజ‌మౌళి లాంటి డైరెక్ట‌ర్నే వేరే హీరోని ఎక్కువ హైలైట్ చేశార‌ని ఇరు హీరోల ఫ్యాన్స్ నుంచి కామెంట్స్ వినిపించాయి. అలాంటప్పుడు ఇద్ద‌రు హీరోల‌ను అట్లీ ఎలా హ్యాండిల్ చేస్తాడో అనే డౌట్ తోనే బ‌న్నీ ఈ ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేశాడ‌ని తెలుస్తోంది. ఇదే క‌థ‌ను అట్లీ ప్ర‌స్తుతం స‌ల్మాన్ ఖాన్ కు చెప్పి సెట్స్ పైకి తీసుకెళ్ల‌డానికి అన్నీ రెడీ చేశాడ‌ని స‌మాచారం.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :