ASBL Koncept Ambience
facebook whatsapp X

అమరావతికి రియల్ బూమ్..

అమరావతికి రియల్ బూమ్..

ఏపీ రాజధాని అమరావతిలో మరోసారి రియల్ బూమ్ కనిపిస్తోందా..? టీడీపీ ప్రభుత్వం రాకతో ఆప్రాంతంలో రేట్లు పెరుగుతున్నాయా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎప్పుడైతే చంద్రబాబు సర్కార్ వచ్చిందో అప్పుడే అక్కడి ప్రాంతానికి కళ వచ్చిందని చెబుతున్నారు స్థానిక రైతులు. వైసీపీ సర్కార్ ఓడిపోవడంతో అమరావతి ప్రాంత రైతులు సంబరాలు చేసుకున్నారు. మళ్లీ తమ భూములకు మంచి ధర వస్తుందని.. ఈప్రాంతం దశ తిరిగినట్లే అని సంబరపడిపోతున్నారు.

అయితే టీడీపీ సర్కార్ అధికారాన్ని దక్కించుకోవడం.. అమరావతి అభివృద్ధికి ప్రాధాన్యమిస్తామని చంద్రబాబు ప్రకటించడంతో హైదరాబాద్ లో ఉన్న రియల్ సంస్థలు కూడా ఇప్పుడు.. ఏపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈసంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయంటున్నారు. దీనికి తోడు గతంలో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా పనిచేసిన సమయంలో చంద్రబాబుతో.. ఆయా సంస్థలనేతలకు ఉన్న పరిచయాలు కూాడా ఇందుకు ఉపకరిస్తాయంటున్నారు.

సౌత్ లో గుర్తింపు ఉన్న నగరం హైదరాబాద్. అన్ని వనరులు ఉన్న భాగ్యనగరం అభివృద్ధిలో ఎప్పుడూ ముందుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రాష్ట్రం విడిపోయిన తర్వాత మరింత వేగం పుంజుకుంది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ భూం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. భాగ్యనగరం చుట్టూ ఉన్న రంగారెడ్డి, మేడ్చల్, తదితర జిల్లాలు కూడా బాగా డెవలప్ అయ్యాయి. ఇక్కడి స్థలాలకు కోట్లాది రూపాయల డిమాండ్లు వచ్చాయి. అయితే ఏపీసీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు చేసిన ప్రకటనతో.. హైదరాాబాద్ రియల్ ఎస్టేట్ డైనమిక్స్ మారవచ్చంటున్నారు నిపుణులు..

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి గణనీయమైన మెజారిటీ వచ్చింది. పైగా కేంద్రంలో ప్రధాన మిత్రపక్షంగా ఉండడం వల్ల పెద్ద ఎత్తున అమరావతికి పెట్టుబడులు రానున్నాయి. ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పై తీవ్రంగా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడి రియల్ సంస్థలు అమరావతికి షిఫ్ట్ కావచ్చన్న ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. అనేక మంది పెట్టుబడిదారులు, వ్యాపారులు ఆంధ్రప్రదేశ్ కు వలస వెళ్లే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది హైదరాబాద్ నుంచి కొంత పెట్టుబడులను ఆకర్షించవచ్చని, దీని వల్ల తెలంగాణ రాజధాని రియల్ ఎస్టేట్ ధరలు 10-15 శాతం మేర తగ్గే ఛాన్స్ ఉందని వాణిజ్య స్థిరాస్తి మార్కెట్ క్షీణించే అవకాశం కూడా లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కారణం కాగలదని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ చేసిన పరిశోధనలో వెల్లడైంది. అయితే, ఆంధ్రప్రదేశ్ కు భారీ పెట్టుబడులు తీసుకువచ్చే దిశగా చంద్రబాబు ప్రణాళికలు రెడీ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో భాగ్యనగరం రియల్ పెట్టుబడి దారులను ఏపీ ఆకర్షించే అవకాశం ఉన్నందున హైదరాబాద్ పై సానుకూల ప్రభావం పడుతుందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందని జూన్ 11న చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :